Mike Tyson Birthday : లెజెండ్రీ బాక్సర్ బర్త్ డే విషెస్ తెలిపిన లైగర్ టీమ్.. స్పెషల్ వీడియో

Liger Movie Team: టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ తెరకెక్కిస్తోన్న లేటెస్ట్ మూవీ లైగర్. క్రేజీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ నటిస్తుంది. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ సినిమాతో విజయ్ బాలీవుడ్‌కు..

Mike Tyson Birthday : లెజెండ్రీ బాక్సర్ బర్త్ డే విషెస్ తెలిపిన లైగర్ టీమ్.. స్పెషల్ వీడియో
Mike Tyson Birthday
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 30, 2022 | 11:40 AM

టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరిజగన్నాథ్(Puri Jagannadh) తెరకెక్కిస్తోన్న లేటెస్ట్ మూవీ లైగర్. క్రేజీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ నటిస్తుంది. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ సినిమాతో విజయ్ బాలీవుడ్‌కు.. అనన్య టాలీవుడ్‌కు ఒకేసారి పరిచయం అవుతున్నారు. ఇప్పటికే 70 శాతంకు పైగా లైగర్ సినిమా షూటింగ్ జరుపుకుంది. బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ కథలో విజయ్ బాక్సర్ గా కనిపించనున్నాడు. అలాగే ఈ సినిమాలో లెజెండ్రీ బాక్సర్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. లెజెండ్రీ బాక్సర్ మైక్ టైసన్ పుట్టిన రోజు నేడు.  ఈ సినిమాతో మైక్ టైసన్ మొట్ట మొదటిసారిగా ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద కనిపించనున్నారు. ఇక మైక్ టైసన్ పుట్టిన రోజు సందర్భంగా చిత్రయూనిట్ ఆయనకు విషెస్ తెలుపుతూ.. ఓ స్పెషల్ వీడియోను షేర్ చేశారు.

నిర్మాత కరణ్ జోహార్- హీరో విజయ్ దేవరకొండ – ఛార్మీ కౌర్ – విష్ణు – అనన్య పాండే -పూరీ జగన్నాధ్ ఈ వీడియో ద్వారా టైసన్ కు బర్త్ డే విషెస్ తెలిపారు. అలాగే ఈ వీడియోలో మూవీ మేకింగ్ కూడా చూపించారు. ఇక ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్ , గ్లిమ్ప్స్ సినిమా అంచనాలను తారాస్థాయికి చేర్చాయి. ఆ తర్వాత విడుదలైన థీమ్ సాంగ్ ఆ అంచనాలను మరింత పెంచేసింది..ఆగస్టు 25న రిలీజ్ కాబోతోంది లైగర్ మూవీ. టైటిల్ అనౌన్స్‌మెంట్‌ నుంచి మొనీమధ్య వచ్చిన గ్లింప్స్‌ దాకా అన్నీ సినిమాకు క్రేజ్ పెంచే మూమెంట్సే. ఇక ఈ మధ్య బైటికొస్తున్న ప్రీ -రిలీజ్ బిజినెస్ లెక్కలైతే లైగర్‌ స్టామినాకు శాంపిల్‌పీసెస్‌గా మారాయి. లైగర్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ఏకంగా 65 కోట్లకు అమ్ముడయ్యాయన్నది టాక్. ఓటీటీ హిస్టరీలో ఇదొక అండర్‌లైన్ చేసుకోదగ్గ డీల్ అట. ఇక థియేటర్ బిజినెస్ ఏ రేంజ్‌లో వుంటుందన్న అంచనాలు ఇండస్ట్రీలో జోరుగా షురూ అయ్యాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి