Boney Kapoor: భారీ ప్రాజెక్టులతో ఫుల్ జోష్ లో బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్.. లైన్‌లో ఏకంగా ఐదు సినిమాలు

బాలీవుడ్ అగ్ర నిర్మాత బోనీ కపూర్ నిర్మాణంలో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. మిస్టర్ ఇండియా, రూప్ కీ రాణీ చోర్ం కా రాజా, నో ఎంట్రీ, జుదాయీ, వాంటెడ్ వంటి బ్లాక్ బస్టర్

Boney Kapoor: భారీ ప్రాజెక్టులతో ఫుల్ జోష్ లో బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్.. లైన్‌లో ఏకంగా ఐదు సినిమాలు
Boney Kapoor
Rajeev Rayala

| Edited By: Ravi Kiran

Feb 06, 2022 | 10:04 AM

Boney Kapoor: బాలీవుడ్ అగ్ర నిర్మాత బోనీ కపూర్ నిర్మాణంలో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. మిస్టర్ ఇండియా, రూప్ కీ రాణీ చోర్ం కా రాజా, నో ఎంట్రీ, జుదాయీ, వాంటెడ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తీశారు బోనీ. ముఖ్యంగా ఆయన నిర్మించిన చిత్రాలు చాలావరకు తెలుగు, తమిళ్ భాషల్లో సూపర్ డూపర్ హిట్ అయినా రీమేక్ చిత్రాలే. ప్రస్తుతం తమిళ్ స్టార్ హీరో అజిత్‌ కుమార్ హీరోగా జీ స్టూడియోస్‌ సంస్థ, బేవ్యూ ప్రాజెక్ట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న’వాలిమై’ ప్రపంచ వ్యాప్తంగా హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ భాషల్లో విడుదల కాబోతుంది. హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 24న విడుద‌ల చేస్తున్నారు. అంతే కాకుండా.. మరో అయిదు భారీ ప్రాజెక్టులతో ఫుల్ జోష్ మీదున్నారు బాలీవుడ్ షో మాన్ బోనీ కపూర్.

ప్రపంచంలో అత్యధిక మంది ఆదరించే ఫుట్ బాల్ ఆట నేపథ్యంలో యధార్థ కథ ఆధారంగా బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘మైదాన్’. భారత దేశాన్ని ఫుట్ బాల్ రంగంలో ప్రపంచ పటంలో నిలిపిన కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీద్ జీవిత కథ ఆధారంగా ‘మైదాన్’ తెరకెక్కుతోంది. క్రీడా నేపథ్యంలో స్ఫూర్తివంతమైన కథగా ‘మైదాన్’ ను నిర్మిస్తున్నారు. ప్రియమణి, గజరాజ్ రావ్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ‘బధాయి హో’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన అమిత్ రవీంద్రనాథ్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఏ ఆర్ రహమాన్ మ్యూజిక్ డైరెక్టర్. పాండమిక్ కారణంగా సినిమా విడుదల పలుసార్లు వాయిదా పడుతూ వస్తుంది. తాజాగా న్యూ రిలీజ్ డేట్‌ను మూవీ టీం అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. 2022 జూన్ 3న ‘మైదాన్’ చిత్రాన్ని హిందీ, తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో భారీగా స్థాయిలో విడుదల చెయ్యబోతున్నారు.

అలాగే కోలీవుడ్ స్టార్ ఉదయనిధి స్టాలిన్ హీరోగా ఆరి, తాన్యా రవి చంద్రన్, నటిస్తున్న తమిళ్ చిత్రం నెంజుకు నీది ఈ చిత్రానికి అరుణ్రాజా కామరాజ దర్శకుడు గా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా బోనీ కపూర్ తనయ జాన్వీ కపూర్, సన్నీ కౌశల్, మనోహ్ పహ్వ నటిస్తున్న హిందీ చిత్రం ‘మిళి’.  ఈ చిత్రానికి దర్శకుడు జేవియర్ మాతుకుట్టి కాగా, ఏ ఆర్ రహమాన్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఇక కోలీవుడ్ స్టార్ సత్యరాజ్, ఊర్వశి, ఆర్ జె బాలాజీ, అపర్ణ బాలమురళి నటిస్తున్న తమిళ్ చిత్రం ‘వీటిలా విషేషంగా’.  ఈ చిత్రానికి దర్శకుడు ఆర్ జె బాలాజీ కాగా, గిరీష్ గోపాల కృష్ణన్ మ్యూజిక్ కంపోజర్. ఈ సినిమాలన్నీ షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

మరిన్ని ఇక్కడ చదవండి :

PM Modi: తెలుగు సినిమాలపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.. పీఎం మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు..

Rahul Ramakrishna: అంతా ఒట్టిదే తూచ్.. జోక్ చేశా అంటున్న నటుడు.. మండిపడుతున్న నెటిజన్లు

Ravi Teja: ఖిలాడీతో బాలీవుడ్ లో అడుగు పెట్టనున్న మాస్ మహారాజా రవితేజ.. హిందీ ప్రేక్షకులను కూడా నవ్విస్తాడంటున్న నిర్మాతలు..

 

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu