Prabhas: బీటౌన్ ట్రోలర్స్ నోరుమూయించిన డార్లింగ్.. ఒక్క దెబ్బతో బాలీవుడ్ షాక్
వడాపావ్..! ఇదో ఫేమస్ స్ట్రీట్ ఫుడ్.. ముంబయ్‌లో ఎక్కడ పడితే అక్కడ ఈజీగా దొరుకుంది.. అందరి ఆకలి తీరుస్తుంది. అయితే ఇదే వడాపావ్‌తో ప్రభాస్‌ను పోలుస్తున్నారు నార్త్ నెటి..జనం..!

వడాపావ్..! ఇదో ఫేమస్ స్ట్రీట్ ఫుడ్.. ముంబయ్‌లో ఎక్కడ పడితే అక్కడ ఈజీగా దొరుకుంది.. అందరి ఆకలి తీరుస్తుంది. అయితే ఇదే వడాపావ్‌తో ప్రభాస్( Prabhas)ను పోలుస్తున్నారు నార్త్ నెటి..జనం..! అంతేకాదు వడాపావ్ తో మన డార్లింగ్ ఫేస్ ను పోల్చుతూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.. మన స్టార్ హీరోను అవమానిస్తున్నారు కూడా.! అయితే బాహుబలి సినిమాతో చార్మింగ్ హీరోగా పేరు తెచ్చుకున్న ప్రభాస్.. ఆ సినిమా వరల్డ్ వైడ్ హిట్తో క్రేజీ హీరోగా కూడా మారిపోయాడు. బాలీవుడ్ బడా హీరోలను కూడా వెనక్కి నెట్టేంత పాపులారిటీని ఒక్కసారిగా సంపాదించుకున్నాడు. బీ టౌన్ అమ్మాయిల కలల రాకుమారుడిగా.. అబ్బాయిలు ఫాలో అయ్యే స్టైలిష్ ఐకాన్ గా కూడా మారిపోయాడు మన ప్రభాస్.
ఆ రీజన్ తోనే సాహో సినిమాతో బాలీవుడ్‌ను షేక్ చేశాడు ప్రభాస్. సౌత్లో నెగెటివ్ టాక్ వచ్చినా.. నార్త్‌లో మాత్రం ఈ సినిమాతో.. సినిమాలోని తన లుక్స్‌తో దూసుకుపోయాడు. కాని ఆ సినిమా తరువాతే.. వన్ ఫైన్ డే బాలీవుడ్ స్టార్ పార్టీలో మెరిసిన ప్రభాస్‌ను చూసి అందరూ షాక్ అయ్యారు. లుక్స్ మారిపోయి.. ఛార్మింగ్ ను కోల్పోయి ఉన్న ప్రభాస్ గురించే మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. వాడాపావ్‌తో పోల్చుతూ ట్రోల్స్ చేయడం కూడా స్టార్ట్ చేసి.. ప్రభాస్ పేరునే మార్చేసే దాకా వెళ్లారు. అయితే రాధేశ్యామ్ లో కాస్త బెటర్ లుక్స్తో డార్లింగ్ కనిపించడంతో.. మళ్లీ బీటౌన్ జనాలు రియలైజేషన్ బాట పట్టారు. ట్రోలింగ్ తగ్గించి మళ్లీ ప్రభాస్ ఆదిపురుష్ కోసం వెయింటింగ్ స్టార్ట చేశారు.
మరిన్ని ఇక్కడ చదవండి :