AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akshay Kumar : బాలీవుడ్‌ స్క్రీన్‌కు ఆపద్భాందవుడిగా మారిన స్టార్ హీరో..

ఇండస్ట్రీ అంతా ఒకవైపు నేను ఒక్కడినే ఒకవైపు అంటున్నారు బాలీవుడ్ యాక్షన్‌ హీరో అక్షయ్‌ కుమార్‌. బాక్సాఫీస్‌ను రూల్‌ చేస్తున్న ఖాన్స్‌ కూడా మేకింగ్, రిలీజ్‌ల విషయంలో డైలామాలో ఉంటే..

Akshay Kumar : బాలీవుడ్‌ స్క్రీన్‌కు ఆపద్భాందవుడిగా మారిన స్టార్ హీరో..
Akshay Kumar
Rajeev Rayala
|

Updated on: Mar 07, 2022 | 6:44 AM

Share

Akshay Kumar : ఇండస్ట్రీ అంతా ఒకవైపు నేను ఒక్కడినే ఒకవైపు అంటున్నారు బాలీవుడ్ యాక్షన్‌ హీరో అక్షయ్‌ కుమార్‌. బాక్సాఫీస్‌ను రూల్‌ చేస్తున్న ఖాన్స్‌ కూడా మేకింగ్, రిలీజ్‌ల విషయంలో డైలామాలో ఉంటే… అక్షయ్‌ మాత్రం వరుసగా రిలీజ్‌లు.. అంతకన్నా బిజీగా షూట్‌లతో హల్ చల్ చేస్తూ.. బాలీవుడ్‌ స్క్రీన్‌కు ఆపద్భాందవుడిగా కనిపిస్తున్నారు ఆయన ఎవరంటే. బాలీవుడ్లోనే కాదు.. నేషనల్‌ లెవల్‌లో మోస్ట్ హ్యాపెనింగ్ హీరో అక్షయ్‌కుమారే. కోవిడ్ సిచ్యుయేషన్‌లో ఒక్క సినిమా కంప్లీట్‌ చేయడానికి హీరోలు కిందామీద అవుతుంటే.. అక్షయ్‌ మాత్రం వరుసగా పదుల సంఖ్యలో సినిమాలు చేస్తున్నారు. మేకింగ్ విషయంలోనే కాదు.. రిలీజుల్లో కూడా ఖిలాడీ హీరో జోరు అదే రేంజ్‌లో ఉంది.

నేషనల్‌ లెవల్‌లో కోవిడ్ తరువాత నాలుగు సినిమాలు రిలీజ్ చేసిన ఒకేఒక్క హీరోగా రికార్డ్ సృష్టించారు అక్షయ్‌ కుమార్‌. అంతేకాదు ఈ సిచ్యుయేషన్‌లోనే ఆరు సినిమాల షూటింగుల్లో పార్టిసిపేట్ చేస్తూ యంగ్ జనరేషన్‌లో జోష్ నింపుతున్నారు. కోవిడ్ పీక్స్‌లో ఉన్న టైమ్‌లోనూ బెల్‌ బాటమ్‌, అత్రంగిరే సినిమాలు షూట్ చేసి రిలీజ్ చేశారు అక్కి. ఇప్పుడు బచ్చన్‌ పాండేగా ఆడియన్స్‌ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. తమిళ బ్లాక్ బస్టర్‌ జిగర్తాండకు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో టైటిల్‌ రోల్‌లో రఫ్‌ అండ్ టఫ్‌గా కనిపిస్తున్నారు అక్షయ్‌. మాస్ ఎలివేషన్‌ని మరో లెవల్‌లో చూపిస్తున్న ఈ సినిమా మార్చి 18న రిలీజ్‌ అవుతోంది. ఈలోగా బాలీవుడ్‌లో బిగ్ రిలీజెస్‌ ఏవీ లేవు కాబట్టి… నార్త్ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించే సినిమా ఇదే అవుతుందన్న కాన్పిడెన్స్‌ మేకర్స్‌లో కనిపిస్తోంది. పృథ్వీరాజ్‌, రక్షాబంధన్‌, రామ్‌ సేతు సినిమాలు ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. వన్స్.. థియేట్రికల్ రిలీజ్‌లు ఊపందుకుంటే.. ఈ ఏడాదంతా గ్యాప్‌ లేకుండా సినిమాలు రిలీజయ్యేలా ప్లాన్ చేస్తున్నారు అక్షయ్‌ కుమార్‌.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bigg Boss Non Stop: బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ నుంచి ముమైత్‌ ఖాన్‌ ఎలిమినేట్‌.. బయటికొచ్చాక ఏం చెప్పిందంటే..

Radhe Shyam: ప్రభాస్‌ సినిమా ఫస్ట్‌ రివ్యూ వచ్చేసింది.. రాధేశ్యామ్ సినిమా ఎలా ఉందంటే!..

Ram Charan: మెగా పవర్‌స్టార్‌కు బాహుబలి కాజా.. డైరెక్టర్‌ శంకర్‌కు కూడా.. నెట్టింట్లో వైరల్‌ గా మారిన ఫొటోలు..