Kiara Advani: ఎన్టీఆర్ చిత్రం కోసం కియారా అంత డిమాండ్ చేస్తోందా..? ఆలోచనలో పడ్డ దర్శక, నిర్మాతాలు..
Kiara Advani: అనతికాలంలో అగ్ర హీరోయిన్ల జాబితాలో చోటు సంపాదించుకుంది నటి కియారా అద్వానీ. తక్కువ సినిమాల్లో నటించిన మంచి గుర్తింపును సంపాదించుకున్న బ్యూటీ వరుస అవకాశాలు సొంతం చేసుకుంటూ దూసుకుపోతోంది. ఇక బాలీవుడ్‌లో...

Kiara Advani: అనతికాలంలో అగ్ర హీరోయిన్ల జాబితాలో చోటు సంపాదించుకుంది నటి కియారా అద్వానీ. తక్కువ సినిమాల్లో నటించిన మంచి గుర్తింపును సంపాదించుకున్న బ్యూటీ వరుస అవకాశాలు సొంతం చేసుకుంటూ దూసుకుపోతోంది. ఇక బాలీవుడ్‌లో బిజీగా ఉన్న సమయంలోనే తెలుగు తెరకు పరిచయమైందీ చిన్నది. భరత్ అనే నేను, వినయ విధేయ రామ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన ఈ చిన్నది మరోసారి తెలుగు తెరపై మెరవనుందని వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమాలో కిరయా అద్వానీని హీరోయిన్‌గా తీసుకోవడానికి దర్శక, నిర్మాతలు భావిస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఇదిలా ఉంటే తాజాగా కియారా ఈ సినిమా కోసం ఏకంగా రూ. 3 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అంత రెమ్యునరేషన్ ఇవ్వాల వద్దా.. అన్న విషయంపైనే మేకర్స్ ఆలోచనలో పడినట్లు సమాచారం. అందుకే కియారాకు సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన చేయట్లేదని ఓ టాక్. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో కూడా కియారాను హీరోయిన్‌గా తీసుకోనున్నారనే చర్చ జరుగుతోంది.
Nithiin: మరో ప్రాజెక్ట్‌కు నితిన్ గ్రీన్ సిగ్నల్.. ఆ డైరెక్టర్ సినిమాలో మరోసారి ‘భీష్మ’ జోడి ?
Happy Birthday Thalapathy: దళపతి విజయ్ 65 సినిమా ఫస్ట్‌లుక్ ఎప్పుడంటే..?