AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kangana Ranaut: సీఏఏకు పూర్తి మద్దతు ప్రకటించిన నటి కంగనా రనౌత్‌.. వారికి కూడా కౌంటరిచ్చిందిగా..

పౌరసత్వ సవరణ చట్టం (CAA) అమలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మంగళవారం ( మార్చి 11)న నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై సామాన్యులే కాకుండా పలువురు సెలబ్రిటీలు కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ ప్రముఖ నటి కంగనా రనౌత్ కూడా పౌరసత్వ సవరణ చట్టంపై స్పందించింది

Kangana Ranaut: సీఏఏకు పూర్తి మద్దతు ప్రకటించిన నటి కంగనా రనౌత్‌.. వారికి కూడా కౌంటరిచ్చిందిగా..
Pm Modi, Kangana Ranaut
Basha Shek
|

Updated on: Mar 13, 2024 | 2:37 PM

Share

పౌరసత్వ సవరణ చట్టం (CAA) అమలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మంగళవారం ( మార్చి 11)న నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై సామాన్యులే కాకుండా పలువురు సెలబ్రిటీలు కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ ప్రముఖ నటి కంగనా రనౌత్ కూడా పౌరసత్వ సవరణ చట్టంపై స్పందించింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామంటూ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది. అదే సమయంలో సీఏఏకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న కొందరి వైఖరిని తప్పుపట్టిన కంగనా అసలు ఈ చట్టం గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలని వారికి కౌంటరిచ్చింది. కంగనా రనౌత్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా ఫోటోను షేర్ చేసింది. దీనికి CAA అని క్యాప్షన్ ఇచ్చింది. ఈ పోస్టుకు మువ్వన్నెల జెండా ఎమోజీని జత చేసింది. తద్వారా పౌరసత్వ సవరణ చట్టం అమలుకు తాము మద్దతిస్తున్నట్లు తెలిపింది కంగనా. అంతేకాదు 2014లో పౌరసత్వ సవరణ చట్టం గురించి ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతున్న వీడియోను షేర్ చేసిందీ బాలీవుడ్ నటి. ‘పౌరసత్వ సవరణ చట్టం గురించి మీ భావాలు, అభిప్రాయాలను వ్యక్తపరిచే ముందు, CAA అంటే ఏమిటో తెలుసుకోండి’ అని తన వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది కంగనా. కాగా ఇటీవలే రాజకీయ పార్టీని ప్రారంబించిన దళపతి విజయ్‌తో సహా కొంతమంది ప్రముఖులు పౌరసత్వ సవరణ చట్టం అమలును వ్యతిరేకిస్తున్నారు.

కంగనా రనౌత్ ఇంకా క్రియాశీల రాజకీయాల్లోకి రాలేదు. అయితే రాజకీయాలకు సంబంధించిన పలు విషయాలపై ఆఆమె తన అభిప్రాయలను వెల్లడిస్తోంది. ఇక టీవీ9 నెట్‌వర్క్ నిర్వహించిన ‘వాట్ ఇండియా థింక్స్ టుడే’ కాన్క్లేవ్‌లో కంగనా తన రాజకీయ రంగ ప్రవేశంపై అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చింది. ‘‘దేశం కోసం ఏదైనా చేయడానికి నాకు సీటు, టికెట్, అధికారం అవసరం లేదు. నటిగా రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా పోరాడాను. ఒకవేళ నేను రాజకీయాల్లోకి రావాలంటే ఇదే సరైన సమయం’ అని కంగనా పేర్కొంది. ఇక సినిమాల విషయానికొస్తే.. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ నేపథ్యంలో కంగనా ‘ఎమర్జెన్సీ’ సినిమా చేస్తోంది. ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించడమే కాకుండా దర్శకత్వం కూడా వహిస్తోందీ అందాల తార. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి

ఈ ఏడాదిలోనే ఎమర్జెన్సీ విడుదల

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి