AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sunny Leone: మళ్ళీ పెళ్లి చేసుకున్న సన్నీలియోన్.. వైరల్‌గా మారిన ఫొటోస్

బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. హిందీలో స్పెషల్ సాంగ్స్ తో పాటు బోల్డ్ పాత్రల్లో నటించిన ఈ అమ్మడు.. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సొంతం చేసుకుంది.

Sunny Leone: మళ్ళీ పెళ్లి చేసుకున్న సన్నీలియోన్.. వైరల్‌గా మారిన ఫొటోస్
Sunny Leone
Rajeev Rayala
|

Updated on: Nov 05, 2024 | 10:55 AM

Share

బాలీవుడ్ బ్యూటీ సన్నీ లియోన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శృంగార తారగా మెప్పించిన ఈ అమ్మడు ఇప్పుడు సినిమాల్లో రాణిస్తుంది. బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. హిందీలో స్పెషల్ సాంగ్స్ తో పాటు బోల్డ్ పాత్రల్లో నటించిన ఈ అమ్మడు.. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సొంతం చేసుకుంది. అలాగే సన్నీ లియోన్ తెలుగులోనూ నటించింది. తెలుగులో ఈ ముద్దుగుమ్మ రాజశేఖర్ హీరోగా నటించిన గరుడ వేగ సినిమాలో స్పెషల్ సాంగ్ , ఆతర్వాత తెలుగులో కరెంట్ తీగ, మంచు విష్ణు నటించిన జిన్నా సినిమాల్లో చేసింది. ఇదిలా ఉంటే సన్నీ వ్యక్తిగత జీవితం గురించి అందరికీ తెలిసిందే.

ఇది కూడా చదవండి : బుర్రపాడు గురూ ఇది.! యమదొంగలో ఉన్న ఈ చిన్నది.. ఆ బిగ్ బాస్ హాట్ బ్యూటీనా..!

తాజాగా సన్నీ మరోసారి పెళ్లి చేసుకుంది. పెళ్లయిన పదమూడేళ్ల తర్వాత బాలీవుడ్ స్టార్ సన్నీలియోన్, ఆమె భర్త డేనియల్ వెబర్ మళ్లీ పెళ్లి చేసుకున్నారు. ఈ జంట మాల్దీవులలో మరోసారి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ పెళ్లి డ్రస్ లో అదరగొట్టారు. వారి పిల్లలు నిషా, అషెర్ సింగ్ వెబర్, నోహ్ సింగ్ వెబర్ కూడా వారిద్దరి వివాహ వేడుకకు సాక్షులుగా ఉన్నారు. ఈ వేడుకల ఫోటోలను సన్నీ తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

ఇది కూడా చదవండి : Bhanu Priya: ఇదేందయ్యా ఇది.. ఈ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ భాను ప్రియా చెల్లెలా..!!

‘తొలిసారి పెళ్లి దేవుడు, స్నేహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. ఈసారి మేం ఐదుగురు మాత్రమే ఉన్నాం. మా మధ్య చాలా ప్రేమ, సమయం ఉంది. నువ్వు ఎప్పుడూ నా జీవితంలో ప్రేమతో ఉంటావు’ అని సన్నీ లియోన్ ఈ పోస్ట్ కు రాసుకొచ్చింది. సన్నీ లియోన్ జనవరి 2011లో డేనియల్ వెబర్‌ని పెళ్లాడింది. ఈ జంట నిషాను జూలై 2017లో దత్తత తీసుకున్నారు. 2018లో అషెర్ సింగ్ వెబర్, నోహ్ సింగ్ వెబర్ అనే కవలలు సరోగసి ప్రెగ్నెన్సీ ద్వారా సన్నీకి జన్మించారు.

ఇది కూడా చదవండి :Devara : అవకాశాలు పెరిగాయి.. ఎలాంటి పాత్ర అయినా రెడీ అంటున్న దేవర బ్యూటీ..!

View this post on Instagram

A post shared by Sunny Leone (@sunnyleone)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us