Sai Pallavi: సాయి పల్లవి అంటే చెప్పలేనంత ఇష్టం.. మాటల్లో చెప్పాలంటే భయమంటున్న బాలీవుడ్ హీరో..

కేవలం సినీ ప్రియులు మాత్రమే కాకుండా.. సెలబ్రెటీలు సైతం ఆమెకు ఫ్యాన్స్ ఉన్నారన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా బాలీవుడ్ హీరో గుల్షన్ దేవయ్యకు సాయి పల్లవి అంటే చెప్పలేనంత ఇష్టమట. తనపై విపరీతమైన ప్రేమ ఉందని.. ఇప్పటికీ ఆ ప్రేమ అలాగే కొనసాగుతుందట. ఈ విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు.

Sai Pallavi: సాయి పల్లవి అంటే చెప్పలేనంత ఇష్టం.. మాటల్లో చెప్పాలంటే భయమంటున్న బాలీవుడ్ హీరో..
Sai Pallavi
Follow us

|

Updated on: May 30, 2023 | 5:10 PM

దక్షిణాది ప్రేక్షకుల ఫేవరేట్ హీరోయిన్ సాయి పల్లవి. అద్భుతమైన నటన.. సహజ సౌందర్యం.. అన్నింటికి మించి ఆమె డాన్స్ అంటే ఇష్టపడని వారుండరు. తన నటన, వ్యక్తిత్వంతో అభిమానులను సంపాదించుకున్నారు. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమెను లేడీ పవర్ స్టార్ అని పిలుచుకుంటారంటే అర్థం చేసుకోవచ్చు సాయి పల్లవి ఫాలోయింగ్ ఏరెంజ్‏లో ఉందో. ప్రేమమ్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ న్యాచురల్ బ్యూటీ.. ఫిదా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే సినిమాలను ఎంచుకోవడం.. ఎలాంటి గ్లామర్ షో లేకుండా.. కేవలం తన నటనతోనే ఆడియన్స్‏కు కట్టిపడేస్తుంది. కేవలం సినీ ప్రియులు మాత్రమే కాకుండా.. సెలబ్రెటీలు సైతం ఆమెకు ఫ్యాన్స్ ఉన్నారన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా బాలీవుడ్ హీరో గుల్షన్ దేవయ్యకు సాయి పల్లవి అంటే చెప్పలేనంత ఇష్టమట. తనపై విపరీతమైన ప్రేమ ఉందని.. ఇప్పటికీ ఆ ప్రేమ అలాగే కొనసాగుతుందట. ఈ విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు.

గుల్షన్ దేవయ్య.. దట్ గర్ల్ ఇన్ ఎల్లో బూట్స్ చిత్రంతో బాలీవుడ్ అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత గోలియోన్ కి రాస్లీలా, రామ్లీలా, షైతాన్, హంటర్, కమాండో 3, బ్లర్, బదాయి దో వంటి చిత్రాల్లో నటించి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకు గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే ఇటీవల ఏఐ చాట్ లో పాల్గొన్న ఆయన.. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఈ క్రమంలోనే సాయి పల్లవిపై తనకున్న ప్రేమను బయటపెట్టారు. తన క్రష్ సాయి పల్లవి అని.. ఆమె నంబర్ కూడా తన వద్ద ఉందని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మీరు జీవితాంతం ఒక రకమైన భారతీయ వంటకాలను మాత్రమే తినగలిగితే, అది ఎలా ఉంటుంది? మరియు మీ కోసం దీన్ని వండడానికి మీరు ఏ సెలబ్రిటీని ఎంచుకుంటారు? అని ప్రశ్నించగా.. గుల్షన్ దేవయ్య మాట్లాడుతూ.. “నాకు బెంగాలీ వంటకాలంటే ఇష్టం. సాయి పల్లవి అంటే నాకు చెప్పలేనంత ఇష్టం. కానీ నేను ఆమెను ఎప్పుడూ కలవలేదు. ఆమెకు వంట చేయగలదో లేదో తెలీదు.. ఆమె మంచి డ్యాన్సర్.. అద్భుతమైన నటి. జీవితంలో తనతో కలిసి పనిచేసే అవకాశం వస్తే మాత్రం చాలా సంతోషిస్తాను” అని అన్నారు.