Chandramukhi 2: షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకున్న చంద్రముఖి 2.. రాధికకు గోల్డ్‌ రింగ్‌ గిఫ్ట్‌గా ఇచ్చిన లారెన్స్‌

2005 లో రజనీకాంత్‌ హీరోగా వచ్చిన చంద్రముఖి ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హారర్‌ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. ఇప్పుడు సుమారు 17 ఏళ్ల తర్వాత చంద్రముఖి కి సీక్వెల్‌ రానుంది. ఫస్ట్‌ పార్ట్‌కు దర్శకత్వం వహించిన పి. వాసునే రెండో భాగాన్ని తెరకెక్కిస్తున్నారు.

Chandramukhi 2: షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకున్న చంద్రముఖి 2.. రాధికకు గోల్డ్‌ రింగ్‌ గిఫ్ట్‌గా ఇచ్చిన లారెన్స్‌
Chandramukhi 2 Movie
Follow us
Basha Shek

|

Updated on: May 30, 2023 | 4:52 PM

2005 లో రజనీకాంత్‌ హీరోగా వచ్చిన చంద్రముఖి ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హారర్‌ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. ఇప్పుడు సుమారు 17 ఏళ్ల తర్వాత చంద్రముఖి కి సీక్వెల్‌ రానుంది. ఫస్ట్‌ పార్ట్‌కు దర్శకత్వం వహించిన పి. వాసునే రెండో భాగాన్ని తెరకెక్కిస్తున్నారు. రాఘవ లారెన్స్‌ హీరోగా నటిస్తుండగా, బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రనౌత్‌, రాధికా శరత్‌కుమార్, లక్ష్మీ మీనన్, వడివేలు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎమ్‌.ఎమ్ కీర‌వాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై సుభాస్క‌ర‌న్‌ నిర్మిస్తున్నారు. కాగా చాలా రోజుల క్రితమే ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్‌ పూర్తయ్యింది. దీంతో మూవీ యూనిట్‌ గుమ్మడికాయ కొట్టేసింది. ఇక చంద్రముఖి 2 ఈ సినిమాను వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్‌ మాసంలో రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కాగా ఈ సినిమా షూటింగ్‌లో లారెన్స్‌ తనకు బంగారు ఉంగరంతో పాటు ఖరీదైన వాచిని గిఫ్టుగా ఇచ్చినట్లు నటి రాధికా శరత్‌కుమార్‌ తెలిపారు. ఈ మేరకు షూటింగ్‌లో లారెన్స్‌తో దిగిన ఫొటోను రాధిక షేర్‌ చేయగా అది కాస్తా వైరల్‌గా మారింది. చంద్రముఖి 2 సినిమాలో రాజనర్తకిగా కంగన రనౌత్‌ నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు సినిమాపై ఆసక్తిని పెంచాయి. చంద్రముఖి’ని మించి సీక్వెల్‌ అలరిస్తుందని, త్వరలోనే రిలీజ్‌ డేట్‌ను ప్రకటిస్తామని చిత్ర వర్గాలు తెలిపాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..