AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సినిమాలో ఏదో సరదాకి చేశాం.. పిల్లలు మాత్రం అలాంటి వాటికి దూరంగా ఉండాలి : అనిల్ రావిపూడి

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన మన శంకర వర ప్రసాద్ గారు' చిత్రాన్ని అన్ని జనరేషన్‌ల ఆడియన్స్ అద్భుతంగా సెలబ్రేట్ చేసుకోవడం గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. చిరంజీవి గారితో వర్క్ చేయడం మైండ్-బ్లోయింగ్ ఎక్స్‌పీరియన్స్ అని అన్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి

సినిమాలో ఏదో సరదాకి చేశాం.. పిల్లలు మాత్రం అలాంటి వాటికి దూరంగా ఉండాలి : అనిల్ రావిపూడి
Anil Ravipudi
Rajeev Rayala
|

Updated on: Jan 23, 2026 | 4:19 PM

Share

మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి ల ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’. విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో అలరించారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించిన ఈ చిత్రంలో నయనతార కథానాయిక నటించారు. శ్రీమతి అర్చన ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేశారు. సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం మెగా బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకొని రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

పవన్ కళ్యాణ్ గారు చిత్రాన్ని అందించడం పై అని స్పందిస్తూ.. కళ్యాణ్ గారు అభినందించడం చాలా ఆనందాన్నిచ్చింది. అలాగే ఇండస్ట్రీలో డైరెక్టర్స్, హీరోస్ చాలామంది పర్సనల్ గా ఫోన్ చేశారు, మెసేజ్లు పెట్టారు. ఈ సక్సెస్ ని మాతో పాటు ఇండస్ట్రీ సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. ఇక ఈ సినిమా కోసం చిరంజీవి గారికి ఫస్ట్ ఫోటో షూట్ చేయగానే లుక్ చూసి స్టన్నింగ్ గా అనిపించింది. ఈ లుక్కు చాలా వావ్ ఫ్యాక్టర్ల ఉండబోతుందనిపించింది. చాలా గ్లామర్ గా ఉన్నారు. సన్నబడిపోయారు. ఈ లుక్కు సినిమా అంతా ఉంటే ఆడియన్స్ ఈ లుక్ కి ఫిదా అయిపోతారు అనిపించింది. ఆయన లుక్కు, స్క్రిప్ట్, టైమింగ్, బాడీ లాంగ్వేజు అన్నీ కుదిరాయి, వింటేజ్ చిరంజీవి గారిని చూసి అందరూ మెస్మరైజ్ అయ్యారు. వింటేజ్ మెగాస్టార్ ని చూపించే అవకాశం నాకు ఇచ్చినందుకు చిరంజీవి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

చిరంజీవి గారికి నేచురల్ గా ఒక టైమింగ్ ఉంటుంది. అలాంటి కథతో ఆయన ప్రజెంట్ చేయగలిగితే అద్భుతంగా ఉంటుందని అనిపించింది. ఈ రోజు అదే జరిగింది. అన్ని జనరేషన్ ఆడియన్స్ సినిమాని అద్భుతంగా ఎంజాయ్ చేస్తున్నారు. చిరంజీవి గారు వెంకటేష్ గారు కలిసి కనిపించబోతున్నారంటే కచ్చితంగా చాలా అంచనాలు ఉంటాయి. అందరికీ నచ్చేలా ప్రజెంట్ చేయడం కూడా పెద్ద టాస్క్. అయితే చిరంజీవి గారు వెంకటేష్ గారి మధ్య ఉన్న నేచురల్ ఫ్రెండ్షిప్ వల్ల నా వర్క్ ఈజీ అయింది. థియేటర్స్ లో చిరంజీవి గారు వెంకటేష్ గారి సీన్స్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. చిరంజీవి గారితో పనిచేయడం మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్. నేను ఆ ఇద్దరు స్టార్స్ ని చూస్తూ పెరిగాను. వాళ్ళని డైరెక్ట్ చేయడం ఒక డ్రీమ్. వాళ్లని ఇమిటేట్ చేస్తూ డాన్స్ చేయడం అనేది మెమరబుల్ ఎక్స్పీరియన్స్. ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు ఆ ఇద్దరితో కలిసి డాన్స్ చేయాలని ఫిక్స్ అయిపోయాను. చిరంజీవి గారు నన్ను ఎంతో ప్రోత్సహించారు. బెల్ట్ స్టెప్ ని పర్ఫెక్ట్ గా చేయమని ఎంకరేజ్ చేశారు. ఆ సీక్వెన్స్ నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

ఇవి కూడా చదవండి

సినిమాలో చిరంజీవి గారు మందు కొట్టే సీన్ చాలా వైరల్ అయింది. దాని గురించి అనిల్ మాట్లాడుతూ.. చిరంజీవి గారి ప్రతి సినిమాలో అలాంటి ఒక పెక్యులర్ సీక్వెన్స్ ఉంటుంది. మందు సీన్స్ లో ఆయన చేసే మ్యానరిజమ్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఆ సీక్వెన్స్ వెంకటేష్ గారికి ఆయనకి మధ్య ఉండే కనెక్షన్ ని కూడా రివిల్ చేస్తుంది. అది థియేటర్లో అద్భుతంగా పేలింది. ఇప్పుడు అందరు సరదాగా రీల్స్ చేస్తున్నారు. అయితే సినిమాలో ఏదో సరదాకి చేస్తాం. పిల్లలు మాత్రం ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని కోరుతున్నాను. ఇక అభిమానుల రెస్పాన్స్ మాటల్లో చెప్పలేను. నన్ను చూసి చాలా ఎమోషనల్ అయిపోయారు. ఎన్నో సంవత్సరాల నుంచి చిరంజీవి గారిని ఇలా చూడాలని వాళ్లు కోరుకున్నారు. ఈ సక్సెస్ ని వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు. థియేటర్స్ లో ఆడియన్స్ ని చూస్తున్నప్పుడు ఒక జాతర లాగా అనిపించింది. అన్ని ఏజ్ గ్రూప్ ప్రేక్షకులు ఈ సినిమాని సెలెబ్రేట్ చేసుకున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..