AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నా పేరు నిలబెట్టావ్ అన్నారు.. ఆ స్టార్ హీరోది గొప్ప మనసు.. శర్వా ఎమోషనల్ కామెంట్స్

'నారీ నారీ నడుమ మురారి’ చిత్రాన్ని సంక్రాంతి విన్నర్‌గా నిలబెట్టిన ఆడియన్స్‌కు థాంక్ యూ. థియేటర్స్ పెరిగాయి . సినిమా మరో నాలుగు వారాలు అద్భుతంగా ఆడుతుందని  సంక్రాంతి విన్నర్ బ్లాక్ బస్టర్ ఈవెంట్ లో చార్మింగ్ స్టార్ శర్వానంద్ అన్నారు . 

నా పేరు నిలబెట్టావ్ అన్నారు.. ఆ స్టార్ హీరోది గొప్ప మనసు.. శర్వా ఎమోషనల్ కామెంట్స్
Sharwanand
Rajeev Rayala
|

Updated on: Jan 23, 2026 | 3:59 PM

Share

చార్మింగ్ స్టార్ శర్వా సంక్రాంతి బ్లాక్ బస్టర్ ‘నారీ నారీ నడుమ మురారి’. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రై. లిమిటెడ్‌తో కలిసి అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర ఈ సినిమాను నిర్మించారు. ఇక ఈ సినిమాలో సంయుక్త, సాక్షి వైద్య హీరోయిన్స్ గా నటించారు. జనవరి 14న విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని సంక్రాంతి విన్నర్ గా నిలిచి హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సంక్రాంతి విన్నర్ బ్లాక్ బస్టర్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేడుకలో టీం అందరినీ షీల్డ్స్ అందించారు. సంక్రాంతి విన్నర్ బ్లాక్ బస్టర్ ఈవెంట్ లో చార్మింగ్ స్టార్ శర్వా మాట్లాడుతూ..

ఈ సినిమాని అద్భుతంగా ఆదరించిన ప్రేక్షకులకు, ఈ టైటిల్ ఇచ్చి ముహూర్తం పెట్టిన మా బాలయ్య బాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అని అన్నారు. ఇటీవలే బాలయ్య గారితో మాట్లాడాను. నా పేరు నిలబెట్టావ్ అన్నారు. నెక్స్ట్ సినిమా నుంచి మీరే ముహూర్తం పెట్టాలని అడిగాను. ముందుగా శ్రీ విష్ణుకి థాంక్స్. చివర్లో కామియో రోల్ చేయడం శ్రీ విష్ణు గొప్ప మనసు. ఒక హీరో సినిమాని ఫ్రెండ్షిప్ ని నమ్మి చేయడం అనేది మామూలు విషయం కాదు. అనిల్ గారి ప్రొడక్షన్స్ లో మా ఇద్దరికి కలిసి ఒక కథ రాస్తే తప్పకుండా చేస్తాం. చిన్ని గారితో పదేళ్ళ ఏళ్ల అనుబంధం. ఆయనతో సినిమా చేయాలి. కానీ ఆయన రాజకీయాల్లోకి వెళ్లారు. ఆయన ఈ వేడుకకు రావడం ఆనందంగా వుంది. సుదర్శన్ నాకు చాలా మంచి ఫ్రెండ్. ఇందులో తన క్యారెక్టర్ని ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. భాను నందు రైటింగ్ కి చాలా మంచి పేరు వచ్చింది. వాళ్ళు ఎప్పుడూ ఇలాగే కలిసి పనిచేయాలని కోరుకుంటున్నాను.

రామ్ నెక్స్ట్ జనరేషన్ కి చాలా మంచి డైరెక్టర్ అవుతాడు. జంధ్యాల, ఈవివి గారు తర్వాత ఇప్పుడు అప్ కమింగ్ లో తను ఉన్నాడు. మా కెమెరా మెన్ అద్భుతమైన విజువల్స్ ఇచ్చాడు. మా టీం అందరికీ థాంక్స్. ఈ వేడుకకు విచ్చేసిన వశిష్ట గారికి, త్రినాధ్ గారికి మీడియా మిత్రులకు అందరికీ థాంక్యు. హిట్ వచ్చింది కదా ఎలా ఫీలవుతున్నావ్ అని అడుగుతున్నారు. నిజానికి ఎలా ఫీల్ అవ్వాలి కూడా నాకు తెలియడం లేదు. అందరూ హ్యాపీగా నవ్వుతుంటే చూడడం చాలా బాగుంది. ప్రేక్షకులు గొప్ప విజయాన్ని మాకు ఇచ్చారు. ఈ సినిమా ఎక్కడితో ఆగదు. మరో నాలుగు వారాలు అద్భుతంగా ఆడుతుంది. ఇప్పుడు నుంచి టాక్ స్టార్ట్ అయింది. థియేటర్స్ పెంచాం. ఈ ఫ్రీ డే నుంచి మేమేంటో చూపిస్తాం. అనిల్ గారికి థాంక్స్ చెప్పడం చాలా చిన్న విషయం. హీరో ప్రొడ్యూసర్ కలిసి ఉంటే ఏమవుతుందనేది మేము చూపిస్తాం. నెక్స్ట్ సినిమాకి రూపాయి కూడా అడగను. మళ్ళీ అనిల్ గారు పెద్ద సినిమా చేసే వరకు రూపాయి కూడా తీసుకోను. ఇది నా ప్రామిస్. ఎందుకంటే హిట్ వాల్యూ మాకు తెలుసు. అలాంటి హిట్ ఆయన నాకు ఇచ్చారు. ఆడియన్స్ అందరు కూడా మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు శర్వా.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..

గ్రౌండ్ లో ఫీల్డింగ్ చేస్తున్నారా లేక నిద్రపోతున్నారా?
గ్రౌండ్ లో ఫీల్డింగ్ చేస్తున్నారా లేక నిద్రపోతున్నారా?
నా పేరు నిలబెట్టావ్ అన్నారు.. ఆ స్టార్ హీరోది గొప్ప మనసు..
నా పేరు నిలబెట్టావ్ అన్నారు.. ఆ స్టార్ హీరోది గొప్ప మనసు..
జనవరి 24న బ్యాంకులు మూసి ఉంటాయా? ఎందుకు..?
జనవరి 24న బ్యాంకులు మూసి ఉంటాయా? ఎందుకు..?
ఎంతకు తెగించార్రా.. ఆ పని తప్పని చెప్పిన పాపానికి.. ఇంతలా
ఎంతకు తెగించార్రా.. ఆ పని తప్పని చెప్పిన పాపానికి.. ఇంతలా
వరదలతో ఈవీ కారు బ్యాటరీ డ్యామేజ్‌కి ఇన్సూరెన్స్ రాదా..?
వరదలతో ఈవీ కారు బ్యాటరీ డ్యామేజ్‌కి ఇన్సూరెన్స్ రాదా..?
రోజుకు నగదు లావాదేవీల పరిమితి ఎంత? ఈ లిమిట్‌ దాటితే జరిమానా!
రోజుకు నగదు లావాదేవీల పరిమితి ఎంత? ఈ లిమిట్‌ దాటితే జరిమానా!
కోదండ రాముడి విల్లు పై ఏమేం చెక్కారో తెలుసా..?
కోదండ రాముడి విల్లు పై ఏమేం చెక్కారో తెలుసా..?
అడవి బిడ్డల అద్భుత పండుగ.. గ్రామస్తుల ఐక్యతను చాటిచెప్పే వేడుక
అడవి బిడ్డల అద్భుత పండుగ.. గ్రామస్తుల ఐక్యతను చాటిచెప్పే వేడుక
హైదరాబాద్ గడ్డపై ఊచకోత..డబుల్ సెంచరీతో సెలక్టర్లకు గట్టి మెసేజ్
హైదరాబాద్ గడ్డపై ఊచకోత..డబుల్ సెంచరీతో సెలక్టర్లకు గట్టి మెసేజ్
మద్య నిషేధం చేద్దామన్న సర్పంచ్.. మందుబాబుల స్టన్నింగ్ క్వచ్చన్
మద్య నిషేధం చేద్దామన్న సర్పంచ్.. మందుబాబుల స్టన్నింగ్ క్వచ్చన్