Bigg Boss 8: బిగ్ బాస్ సీజన్ 8లో ఊహించని కంటెస్టెంట్.. హౌస్‌లోకి నందమూరి హీరో ఎంట్రీ..?

మరోసారి నాగార్జున ఈ సీజన్ కు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే రెండు ప్రోమోలు విడుదల చేశారు. ఇక బిగ్ బాస్ సీజన్ 8 హౌస్‌లోకి ఎవరు వెళ్తారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బిగ్ బాస్ 8లోకి ఈసారి చాలా మంది పాల్గొంటారని తెలుస్తోంది. గత సీజన్ లో రైతు బిడ్డగా వచ్చిన పల్లవి ప్రశాంత్ ఎవరు ఊహించని విధంగా విన్నర్ గా నిలిచాడు.

Bigg Boss 8: బిగ్ బాస్ సీజన్ 8లో ఊహించని కంటెస్టెంట్.. హౌస్‌లోకి నందమూరి హీరో ఎంట్రీ..?
Bigg Boss 8
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 13, 2024 | 12:12 PM

బిగ్ బాస్ సీజన్ 8 త్వరలోనే ప్రారంభంకానుంది. దాంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఇప్పటికే సీజన్ 7 సూపర్ సక్సెస్ అవ్వడంతో ఇప్పుడు సీజన్ 8 కోసం ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. మరోసారి నాగార్జున ఈ సీజన్ కు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే రెండు ప్రోమోలు విడుదల చేశారు. ఇక బిగ్ బాస్ సీజన్ 8 హౌస్‌లోకి ఎవరు వెళ్తారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బిగ్ బాస్ 8లోకి ఈసారి చాలా మంది పాల్గొంటారని తెలుస్తోంది. గత సీజన్ లో రైతు బిడ్డగా వచ్చిన పల్లవి ప్రశాంత్ ఎవరు ఊహించని విధంగా విన్నర్ గా నిలిచాడు. దాంతో ఈసారి హౌస్ లోకి ఎవరు వెళ్తారు. సామాన్యులు ఎవరు వెళ్తున్నారు. సెలబ్రెటీలు ఎవరు వస్తున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది.

ఇది కూడా చదవండి : Naga Chaitanya: నాగ చైతన్య, శోభిత కూడా విడిపోతారు.. వేణు స్వామికి నాగ చైతన్య అదిరిపోయే కౌంటర్

ఇక ఇప్పటికే సోషల్ మీడియాలో చాలా మంది పేర్లు వైరల్ గా మారాయి. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్న పేర్లు ఇవే.. వేణుస్వామి, రీతూ చౌదరి, సీరియల్ ఆర్టిస్టులు అంజలి, యశ్మీ గౌడ, తేజశ్వీ గౌడ, సీనియర్ నటి సనా, కమెడియన్ బంచిక్ బబ్లూ, కిరాక్ ఆర్పీ, రింగ్ రియాజ్, పాగల్ పవిత్ర ఇలా చాలామంది పేర్లు అయితే వినిపిస్తున్నాయి. వీరిలో చాలా మంది దాదాపు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్నారని అంటున్నారు. తాజాగా మరో పేరు కూడా వినిపిస్తుంది.

ఇది కూడా చదవండి : ఈ నటుడి భార్య, కూతురు స్టార్ హీరోయిన్స్.. ఇద్దరూ బాలయ్య బాబుతో నటించారు

నందమూరి ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన హీరో చైతన్య కృష్ణ. నందమూరి చైతన్య కృష్ణ చాలా మందికి సుపరిచితుడే.. చేసింది తక్కువ సినిమాలే అయిన మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 2003లో జగపతి బాబు హీరోగా వచ్చిన ‘ధమ్’లో ఓ పాత్రలో కనిపించాడు చైతన్య. ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నాడు. చాలా రోజుల తర్వాత మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రీసెంట్ గా బ్రీత్ అనే సినిమా చేశాడు. కానీ ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. మధ్యలో పాలిటిక్స్ లో కూడా కనిపించాడు ఈ హీరో. ఇక ఇప్పుడు ఈ నందమూరి హీరో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ హౌస్‌లోకి చైతన్య కృష్ణ ఎంట్రీ ఇస్తున్నారన్నదని పై ఎలాంటి క్లారిటీ లేదు. ఈ వార్తల్లో వాస్తవం ఎంత అన్నది మాత్రం తెలియాల్సి ఉంది. సెప్టెంబర్ 8 ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం అవుతుందని టాక్ వినిపిస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..