Nagarjuna: అక్కినేని అభిమానులకు గుడ్ న్యూస్.. ‘మాస్’ మళ్లీ వచ్చేస్తున్నాడు.. రీరిలీజ్ ఎప్పుడంటే..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓవైపు కమర్షియల్ సినిమాల్లో నటిస్తూనే మరోవైపు వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ దశబ్దాలుగా సినీ ప్రేక్షకులను అలరిస్తున్న హీరో నాగార్జున. అక్కినేని నటవారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనదైన నటనతో మెప్పించిన నాగార్జున.. టాలీవుడ్ మనథ్ముడిగా గుర్తింపు సంపాదించుకున్నారు. ఇప్పుడు నాగార్జున బర్త్ డే సందర్భంగా ఆయన నటించిన సూపర్ హిట్ మాస్ చిత్రాన్ని మరోసారి అడియన్స్ ముందుకు తీసుకురానున్నారు.

Nagarjuna: అక్కినేని అభిమానులకు గుడ్ న్యూస్.. 'మాస్' మళ్లీ వచ్చేస్తున్నాడు.. రీరిలీజ్ ఎప్పుడంటే..
Mass
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 13, 2024 | 2:16 PM

కొన్నాళ్లుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో రీరిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోస్ పుట్టినరోజులు, ప్రత్యేకమైన రోజులలో ఒకప్పటి సూపర్ హిట్ చిత్రాలను రీరిలీజ్ చేస్తుండగా.. తమ అభిమాన తారల చిత్రాలను మరోసారి చూసేందుకు ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన చిత్రాలకు ఏ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందో చెప్పక్కర్లేదు. ఇటీవలే సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు సందర్బంగా విడుదలైన మురారి సినిమాకు భారీగా కలెక్షన్స్ వచ్చాయి. అలాగే థియేటర్లలో మహేష్ ఫ్యాన్స్ చేసిన రచ్చ మాములుగా లేదు. ఇప్పుడు అక్కినేని అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓవైపు కమర్షియల్ సినిమాల్లో నటిస్తూనే మరోవైపు వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ దశబ్దాలుగా సినీ ప్రేక్షకులను అలరిస్తున్న హీరో నాగార్జున. అక్కినేని నటవారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనదైన నటనతో మెప్పించిన నాగార్జున.. టాలీవుడ్ మనథ్ముడిగా గుర్తింపు సంపాదించుకున్నారు. ఇప్పుడు నాగార్జున బర్త్ డే సందర్భంగా ఆయన నటించిన సూపర్ హిట్ మాస్ చిత్రాన్ని మరోసారి అడియన్స్ ముందుకు తీసుకురానున్నారు.

ఆగస్ట్ 29న నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానుల కోసం ఒకప్పటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా మాస్ చిత్రాన్ని రీరిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రంలో నాగార్జున హీరోగా నటించగా.. రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించారు. యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రంలో జ్యోతిక, చార్మి కౌర్, రఘువరన్, ప్రకాష్ రాజ్, సునీల్, రాహుల్ దేవ్ కీలకపాత్రలు పోషించారు. నాగార్జున సొంత బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన మాస్ చిత్రాన్ని 2004లో విడుదల చేయగా మంచి వసూళ్లు రాబట్టింది. అలాగే అప్పట్లో ఈ మూవీ మ్యూజికల్ హిట్ గా నిలిచింది. దాదాపు 20 ఏళ్ల తర్వాత ఈ చిత్రాన్ని నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఒకరోజు ముందుగానే ఆగస్ట్ 28న రిలీజ్ చేయనున్నారు.

ఇదిలా ఉంటే.. దాదాపు మూడు దశాబ్దాలుగా సినీ ప్రపంచాన్ని ఏలుతున్న నాగార్జున.. ఈ ఏడాది ప్రారంభంలో నా సామిరంగ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, కోలీవుడ్ హీరో ధనుష్ హీరోగా నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా అడియన్స్ ముందుకు రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.