Committee Kurrollu: సత్తా చాటిన కమిటీ కుర్రోళ్ళు.. నాలుగు రోజుల్లోనే భారీ వసూళ్లు

నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. ఈ సినిమాకు య‌దు వంశీ ద‌ర్శ‌కుడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ఆగస్ట్ 9న వంశీ నందిపాటి విడుదల చేశారు. డిఫరెంట్ కంటెంట్‌తో ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్‌, అటు యూత్‌ను ఆక‌ట్టుకున్న ఈ చిత్రం మండే టెస్ట్ కూడా పాస్ అయ్యింది.

Committee Kurrollu: సత్తా చాటిన కమిటీ కుర్రోళ్ళు.. నాలుగు రోజుల్లోనే భారీ వసూళ్లు
Committee Kurrollu Movie
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 14, 2024 | 7:14 AM

కొత్త సినిమాలు, చిన్న సినిమాలు తాకివుడ్ కు కొత్త కళను తీసుకువస్తున్నాయి. ఓ వైపు పెద్ద పెద్ద స్టార్ హీరోలు పాన్ ఇండియా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంటే.. చిన్న హీరోలు కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ హిట్స్ అందుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఆ సినిమానే కమిటీ కుర్రాళ్ళు. ప్రేక్షకులను ఆకట్టుకునే కథ , కథనంతో ఈ సినిమాను తెరకెక్కించారు. మొదటి షో నుంచి కమిటీ కుర్రాళ్ళకు పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా విపరీతంగా ఆకట్టుకుంటోంది.

ఇది కూడా చదవండి : Naga Chaitanya: నాగ చైతన్య, శోభిత కూడా విడిపోతారు.. వేణు స్వామికి నాగ చైతన్య అదిరిపోయే కౌంటర్

నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. ఈ సినిమాకు య‌దు వంశీ ద‌ర్శ‌కుడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ఆగస్ట్ 9న వంశీ నందిపాటి విడుదల చేశారు. డిఫరెంట్ కంటెంట్‌తో ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్‌, అటు యూత్‌ను ఆక‌ట్టుకున్న ఈ చిత్రం మండే టెస్ట్ కూడా పాస్ అయ్యింది. అలాగే అన్నీ ఏరియాస్‌లో సినిమా బ్రేక్ ఈవెన్ సాధించ‌టం విశేషం.

ఇది కూడా చదవండి : ఈ నటుడి భార్య, కూతురు స్టార్ హీరోయిన్స్.. ఇద్దరూ బాలయ్య బాబుతో నటించారు

‘కమిటీ కుర్రోళ్ళు’ నాలుగు రోజుల్లో రూ. 7.48 కోట్లు వచ్చాయి. మంచి ప‌ల్లెటూరి వాతావ‌ర‌ణంలో స్నేహం, ప్రేమ‌, కుటుంబంలోని భావోద్వేగాల‌ను ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రంలో సీనియ‌ర్ న‌టీన‌టుల‌తో పాటు 11 మంది హీరోలు, న‌లుగురు హీరోయిన్స్‌ను తెలుగు సినిమాకు ప‌రిచ‌యం చేస్తూ మేక‌ర్స్ చేసిన ఈ ప్ర‌య‌త్నాన్ని అభినందిస్తూ ప్రేక్ష‌కులు సినిమాను ఆద‌రించార‌ని ట్రేడ్ వ‌ర్గాలంటున్నాయి. సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిందని చిత్ర యూనిట్ తెలియజేసింది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..