Naga Chaitanya: నాగ చైతన్య, శోభిత కూడా విడిపోతారు.. వేణు స్వామికి నాగ చైతన్య అదిరిపోయే కౌంటర్

విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. సినిమాలతో పాటు డిజిటల్ వరల్డ్ లోకి కూడా అడుగుపెట్టాడు. దూత అనే వెబ్ సిరీస్ లో నటించాడు చై. ఇక ఇప్పుడు తండేల్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అయితే నాగ చైతన్య సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కాను ఊహించని వవిధంగా ఈ ఇద్దరూ విడిపోయారు.

Naga Chaitanya: నాగ చైతన్య, శోభిత కూడా విడిపోతారు.. వేణు స్వామికి నాగ చైతన్య అదిరిపోయే కౌంటర్
Naga Chaitanya
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 12, 2024 | 11:14 AM

అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. ఆచితూచి సినిమాలు చేస్తూ కెరీర్ లో ఒకొక్క స్టెప్ ఎక్కుతూ రాణిస్తున్నాడు. నాగ చైతన్య కెరీర్‌లో ఎన్నో సూపర్ హిట్స్ ఉన్నాయి. ఆటోనగర్ సూర్య, మజిలీ, లవ్ స్టోరీలాంటి సినిమాల్లో తన నటనతో ఆకట్టుకున్నాడు నాగ చైతన్య. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. సినిమాలతో పాటు డిజిటల్ వరల్డ్ లోకి కూడా అడుగుపెట్టాడు. దూత అనే వెబ్ సిరీస్ లో నటించాడు చై. ఇక ఇప్పుడు తండేల్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అయితే నాగ చైతన్య సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కాని ఊహించని వవిధంగా ఈ ఇద్దరూ విడిపోయారు. స్టార్ కపుల్ గా పేరుతెచ్చుకున్న చైతన్య ,సామ్ సడన్ గా విడిపోతున్నట్టు అనౌన్స్ చేశారు.

ఇది కూడా చదవండి : నల్లగా, చాలా లావుగా, ఛండాలంగా ఉన్నావ్ అన్నారు.. కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో తిరుగులేని హీరోయిన్ ఆమె..

ఆ సమయంలో వేణు స్వామి పేరు ఎక్కువగా వినిపించింది. ఎందుకంటే.. చై, సామ్ విడిపోతారు అని ముందే చెప్పాడు. ఆయన చెప్పినట్టే ఆ ఇద్దరూ విడిపోయారు. దాంతో ఆయన జాతకం నిజమవుతుందని అంతా అనుకున్నారు. ఆ తర్వాత వేణు స్వామీ చాలా మంది గురించి జాతకం చెప్పారు. కొంతమంది హీరోయిన్స్ ఆయనతో ప్రత్యేక పూజలు కూడా చేయించుకున్నారు. సమంతతో విడిపోయిన తర్వాత నాగ చైతన్య ఇప్పుడు శోభిత దూళిపాళ్లతో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. అయితే దీనిపై కూడా వేణు స్వామి జాతకం చెప్పారు.

ఇది కూడా చదవండి : Mahesh Babu: మహేష్ బాబు దెబ్బకు బ్యాగ్రౌండ్ బయట పెట్టిన అక్కినేని కోడలు..

నాగ చైతన్య , శోభిత దూళిపాళ్ల కూడా విడిపోతారు అని చెప్పాడు వేణు స్వామి. చైతన్య, శోభిత జతలకా ప్రకారం ఈ ఇద్దరూ 2027వరకు కలిసి ఉంటారని తెలిపాడు. ఆతర్వాత విడిపోతారని చెప్పుకొచ్చాడు వేణు స్వామి. దాంతో ఆయన పై నాగ చైతన్య ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అలాగే సోషల్ మీడియాలోనూ వేణు స్వామిపై ట్రోల్స్ చేస్తున్నారు. వేణు స్వామి చెప్పిన దానికి నాగ చైతన్య కౌంటర్ ఇదే అంటూ ఓ వీడియోను వైరల్ చేస్తున్నారు. గతంలో రానా హోస్ట్ గా చేసిన ఓ టాక్ షోకు నాగ చైతన్య గెస్ట్‌గా హాజరయ్యాడు. అప్పుడు జాతకాలను నమ్ముతావా.? అని రానా అడిగితే.. నా పాజిటివ్ గా ఉంటే నమ్ముతా.. లేదంటే నమ్మను అని చెప్పాడు చై. ఈ వీడియోను ఇప్పుడు చై ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. వేణు స్వామికి జాతకానికి చైతన్య కౌంటర్ అంటూ ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు ఫ్యాన్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..