Mahesh Babu: మహేష్ బాబు దెబ్బకు బ్యాగ్రౌండ్ బయట పెట్టిన అక్కినేని కోడలు..

రామన్ రాఘవ్ 2.0 అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఈ చిన్నది. అంతకు ముందు మోడల్ గా రాణించింది. అలాగే పలు యాడ్స్ లోనూ నటిచింది. హిందీలో మూడు సినిమాలు చేసిన తర్వాత తెలుగులో అవకాశం అందుకుంది. గూఢచారి సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆతర్వాత హిందీలో వరుసగా సినిమాలు చేసింది.

Mahesh Babu: మహేష్ బాబు దెబ్బకు బ్యాగ్రౌండ్ బయట పెట్టిన అక్కినేని కోడలు..
Mahesh Babu, Shobitha
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 12, 2024 | 10:07 AM

శోభిత ధూళిపాళ.. ఇప్పుడు ఎక్కడ చూసిన ఈ అమ్మడి పేరే వినిపిస్తుంది. చేసింది తక్కువ సినిమాలే అయిన పాపులారిటీ మాత్రం విపరీతంగా సొంతం చేసుకుంది. తెలుగులో గూఢచారి సినిమాతో పరిచయం అయ్యింది శోభిత దూళిపాళ్ల. రామన్ రాఘవ్ 2.0 అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఈ చిన్నది. అంతకు ముందు మోడల్ గా రాణించింది. అలాగే పలు యాడ్స్ లోనూ నటిచింది. హిందీలో మూడు సినిమాలు చేసిన తర్వాత తెలుగులో అవకాశం అందుకుంది. గూఢచారి సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆతర్వాత హిందీలో వరుసగా సినిమాలు చేసింది. అలాగే తమిళ్ లో మణిరత్నం దర్శకత్వం వహించిన పొన్నియన్ సెల్వన్ సినిమాలో తనఅందంతో ఆకట్టుకుంది.

ఇది కూడా చదవండి : OTT Movie : ఇదెక్కడి రచ్చ రా బాబు..! ఇద్దరమ్మాయిల మధ్య ఘాడమైన ప్రేమ.. ఎక్కడ చూడొచ్చంటే..

ఆతర్వాత అడివి శేష్ హీరోగా మహేశ్ బాబు నిర్మించిన మేజర్ సినిమాలో శోభిత ధూళిపాళ కీలకమైన పాత్రను పోషించింది. ఈ సినిమా 2022 జూన్ 3న విడుదల అయింది. ఈ సినిమా తర్వాత శోభిత క్రేజ్ మరింత పెరిగింది. హాలీవుడ్ లోనూ సినిమా చేసింది ఈ చిన్నది. హాలీవుడ్ లో మంకీ మ్యాన్ అనే సినిమాలో చేసింది. తాజాగా శోభిత అక్కినేని నాగ చైతన్యతో పెళ్ళికి రెడీ అయ్యింది. ఇటీవలే ఈ ఇద్దరి ఎంగేజ్మెంట్ గ్రాండ్ గా జరిగింది.

ఇది కూడా చదవండి :  Naga Chaitanya : సమంతతో ఉన్న ఫోటోను పదిలంగా దాచుకున్న నాగ చైతన్య..

అయితే మేజర్ సినిమా సమయంలో మూవీ టీమ్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూలో చాలా ఆసక్తికర విషయాలను పంచుకున్నారు మూవీ టీమ్. అదే ఇంటర్వ్యూలో శోభిత పై మహేష్ సెటైర్లు కూడా వేశారు. శోభితను తన జర్నీ గురించి చెప్పమంటే అమ్మడు ఇంగ్లిష్ లో మొదలు పెట్టింది. వెంటనే మహేష్ తెలుగులో మాట్లాడవా ప్లీజ్.. కుదిరితే నీ యాసలో మాట్లాడు అన్నారు. దాంతో.. శోభిత తన బ్యాగ్రౌండ్ మొత్తం చెప్పుకొచ్చింది. నేను పుట్టింది తెనాలిలో, పెరిగింది వైజాగ్ లో.. ఆతర్వాత కాలేజ్ కోసం ముంబై కు వెళ్ళాను.. ఆతర్వాత మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్నాను. ఆతర్వాత ఇండస్ట్రీలోకి వచ్చాను అంటూ మొత్తం చెప్పుకొచ్చింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..