AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naga Chaitanya : సమంతతో ఉన్న ఫోటోను పదిలంగా దాచుకున్న నాగ చైతన్య..

నటి శోభితా దూళిపాళ్లతో ఈ అక్కినేని హీరో నిశ్చితార్థం జరిగింది. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు వైరల్‌గా మారాయి. కాగా, నాగ చైతన్య పోస్ట్‌పై అభిమానులు, సినీ సెలబ్రెటీలు కామెంట్స్ చేస్తున్నారు చైతన్యకు విషెస్ తెలుపుతూ పోస్ట్ లు షేర్ చేస్తున్నారు. అయితే సమంతతో ఉన్న కొన్ని ఫోటోలు ఇప్పటికీ నాగ చైతన్య ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఉన్నాయి. ఆ ఫోటోలు చూసి అభిమానులు షాక్ అవుతున్నారు.

Naga Chaitanya : సమంతతో ఉన్న ఫోటోను పదిలంగా దాచుకున్న నాగ చైతన్య..
Naga Chaitanya, Shobitha, S
Rajeev Rayala
|

Updated on: Aug 11, 2024 | 7:25 AM

Share

నాగ చైతన్య, సమంత ఈ జంట విడిపోయిన తర్వాత అభిమానులు చాలా ఫీల్ అయ్యారు. అప్పటి వరకు లవ్లీ కపుల్ గా పేరు తెచ్చుకొన్న చైతన్య, సమంత సడన్ గా విడిపోతున్నట్టు అనౌన్స్ చేసి షాక్ ఇచ్చారు. కాగా ఇప్పుడు నాగ చైతన్య రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు. నటి శోభితా దూళిపాళ్లతో ఈ అక్కినేని హీరో నిశ్చితార్థం జరిగింది. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు వైరల్‌గా మారాయి. కాగా, నాగ చైతన్య పోస్ట్‌పై అభిమానులు, సినీ సెలబ్రెటీలు కామెంట్స్ చేస్తున్నారు చైతన్యకు విషెస్ తెలుపుతూ పోస్ట్ లు షేర్ చేస్తున్నారు. అయితే సమంతతో ఉన్న కొన్ని ఫోటోలు ఇప్పటికీ నాగ చైతన్య ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఉన్నాయి. ఆ ఫోటోలు చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. నాగ చైతన్య సమంత ఫోటోలు ఎందుకు ఉంచుకున్నాడు అంటూ ఆలోచిస్తున్నారు ఫ్యాన్స్.

ఏ మాయ చేశావే సినిమా సెట్‌లోనే నాగ చైతన్య, సమంత ప్రేమలో పడ్డారు.  2017లో అంగరంగ వైభవంగా పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే సరిగ్గా నాలుగేళ్ల తర్వాత విడాకులు తీసుకున్నారు. ఈ ఇద్దరూ విడిపోవడానికి కారణం మాత్రం తెలియదు. విడాకులు తీసుకున్న మూడేళ్లలోపే నాగ చైతన్య మరో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఇది సమంత అభిమానుల ఆగ్రహానికి కారణమైంది.

నాగ చైతన్య మరియు శోభిత డేటింగ్ ప్రారంభించి సంవత్సరాలు గడిచాయి. అవి పుకారు కావచ్చునని కొందరు అనుకున్నారు. ఈ ఇద్దరూ కలిసి విదేశాలకు షికారుకు కూడా వెళ్లారు. ఆసమయంలో తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఇప్పుడు నిశ్చితార్థం అధికారికంగా జరిగింది. ఇప్పుడు సమంత, నాగ చైతన్య ఫోటో వైరల్ అవుతోంది. నాగ చైతన్య రేస్ ట్రాక్ పై కారు ఆపి సమంతతో పోజులిచ్చాడు. ఈ ఫోటో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇది సెప్టెంబర్ 2018లో పోస్ట్ చేయబడింది. ఈ ఫోటోపై అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫోటో ఇప్పటికి నాగ చైతన్య ఇన్ స్టాలో ఉంది. ఈ ఫోటో పై సమంత ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కొందరు ఈ ఫోటోను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. నాగ చైతన్యకు కార్స్ అంటే చాలా ఇష్టం. అందుకే ఆ ఫోటో ను ఉంచుకున్నాడు అంటూ చై ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us