OTT Movie : ఇదెక్కడి రచ్చ రా బాబు..! ఇద్దరమ్మాయిల మధ్య ఘాడమైన ప్రేమ.. ఎక్కడ చూడొచ్చంటే..

రొమాంటిక్ సినిమాలకు, హారర్ జోనర్ సినిమాలు చాలానే అందుబాటులో ఉన్నాయి. ఇక రొమాంటిక్ సినిమాలకు సంబందించిన సినిమాల విషయానికొస్తే.. ఈ టైప్ సినిమాలకు ఆడియన్స్ కి విపరీతమైన క్రేజ్ ఉంది. తాజాగా ఓ రొమాంటిక్ సినిమా ఇప్పుడు ఓటీటీ లవర్స్ ను ఆకట్టుకుంటుంది. ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. ఈ సినిమాలో రొమాంటిక్ సన్నివేశాలు కూడా చాలానే ఉన్నాయి.

OTT Movie : ఇదెక్కడి రచ్చ రా బాబు..! ఇద్దరమ్మాయిల మధ్య ఘాడమైన ప్రేమ.. ఎక్కడ చూడొచ్చంటే..
Ott Movie
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 11, 2024 | 9:25 AM

ఓటీటీల్లో సినిమా చూడటానికి ప్రేక్షకులకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. థియేటర్స్ లో సినిమాలను ఎంజాయ్ చేస్తున్న ప్రేక్షకులు ఓటీటీలోనూ సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ప్రేక్షకులను అలరించడానికి ఓటీటీలో రకరకాల జోనర్స్ సినిమాలు అందుబాటులో ఉన్నాయి. ఇక రొమాంటిక్ సినిమాలకు, హారర్ జోనర్ సినిమాలు చాలానే అందుబాటులో ఉన్నాయి. ఇక రొమాంటిక్ సినిమాలకు సంబందించిన సినిమాల విషయానికొస్తే.. ఈ టైప్ సినిమాలకు ఆడియన్స్ కి విపరీతమైన క్రేజ్ ఉంది. తాజాగా ఓ రొమాంటిక్ సినిమా ఇప్పుడు ఓటీటీ లవర్స్ ను ఆకట్టుకుంటుంది. ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. ఈ సినిమాలో రొమాంటిక్ సన్నివేశాలు కూడా చాలానే ఉన్నాయి.

ఇది కూడా చదవండి :  Naga Chaitanya : సమంతతో ఉన్న ఫోటోను పదిలంగా దాచుకున్న నాగ చైతన్య..

ప్రేమకు వయసుతో సంబంధం లేదు అని చాలా మంది చెప్తూ ఉంటారు. అలాగే ప్రేమ ఎవరి మధ్య అయినా పుడుతుంది. అయితే ఇద్దరు అమ్మాయిలు ప్రేమలో పడటం కూడా మనం చూస్తూనే ఉంటాం.. ఇప్పటికే ఇద్దరి అమ్మాయిల మధ్య ప్రేమను చూపించే సినిమాలు చాలా ఉన్నాయి. తెలుగులో ఆర్జీవీ కూడా ఇలాంటి సినిమా ఒకటి చేశారు. ఇక ఇప్పుడు ఓటీటీలో ఇదే తరహా సినిమా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో ఓ హీరోయిన్ కు పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటారు. ఇందుకోసం ఈమె చిత్రపటాన్ని గీయిస్తుంటారు పేరెంట్స్.. కానీ ఆ హీరోయిన్ మాత్రం ఒప్పుకోదు. దాంతో ఆమె చిత్రపటాన్ని మొఖం లేకుండా గీస్తారు.

ఇది కూడా చదవండి : Malliswari: తస్సాదీయ..!! మల్లీశ్వరి సినిమాలో చిన్నారి ఇప్పుడు గత్తర లేపిందిగా..!

అయితే ఆ చిత్రపటాన్ని పూర్తి చేయడానికి .. ఒక అమ్మాయి వస్తుంది. తాను చిత్రపటం గీయడానికి వచ్చాను అని చెప్పదు. ఆ హీరోయిన్ తో ఆమె ఫ్రెండ్ షిప్ చేస్తుంది. అలా ఆ ఇద్దరి మధ్య స్నేహం కుదురుతుంది. ఇద్దరి మధ్య మాటలు పెరుగుతాయి. ఆ అమ్మాయి హీరోయిన్ తో కాస్త చనువుగా ఉంటుంది. దాంతో స్నేహం కాస్త ఈ ఇద్దరి మధ్య ప్రేమగా మారుతుంది. ఆ తర్వాత ఆమె చిత్ర పటాన్ని గీయడం స్టార్ట్ చేస్తుంది. అయితే ఆ హీరోయిన్ కు తెలియకుండా ఆ చిత్ర పటాన్ని గీయడానికి ట్రై చేస్తుంది ఆమె.. ఇక వీరి మధ్య ప్రేమ ముదురుతుంది. ఒకర్ని విడిచి ఒకరు ఉండలేనంతగా ఉంటారు. ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను మరో విధంగా చూపించుకోవడం స్టార్ట్ చేస్తారు. అయితే వీరి ప్రేమ ఎంత దూరం వెళ్ళింది.? ఆ తర్వాత ఏం జరిగింది.? అనేది సినిమాలో చూడాలి. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. మూవీ పేరు పోట్రెయిట్ ఆఫ్ ఏ లేడీ ఆన్ ఫైర్. ఈ సినిమా కథ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..