Malliswari: తస్సాదీయ..!! మల్లీశ్వరి సినిమాలో చిన్నారి ఇప్పుడు గత్తర లేపిందిగా..!

ఈ సినిమాలో వెంకీ తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. మల్లీశ్వరి సినిమాకు కోటి అందించిన స్వరాలు వీనుల విందుగా ఉన్నాయి. ఇప్పటికీ ఈ సినిమా సాంగ్స్ వినిపిస్తూనే ఉంటాయి. ఇదిలా ఉంటే మల్లీశ్వరి సినిమాలోని నటించిన వారందరికి మంచి గుర్తింపు వచ్చింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో వెంకటేష్ అన్న కూతురిగా నటించిన చిన్నారి గుర్తుందా.? 

Malliswari: తస్సాదీయ..!! మల్లీశ్వరి సినిమాలో చిన్నారి ఇప్పుడు గత్తర లేపిందిగా..!
Malliswari
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 09, 2024 | 10:18 AM

వికటరీ వెంకటేష్ హీరోగా నటించిన ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో మల్లీశ్వరి సినిమా ఒకటి. కె. విజయ భాస్కర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. 2004లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో వెంకటేష్ తన నటనతో ఆకట్టుకున్నాడు. అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో వెంకీ తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. మల్లీశ్వరి సినిమాకు కోటి అందించిన స్వరాలు వీనుల విందుగా ఉన్నాయి. ఇప్పటికీ ఈ సినిమా సాంగ్స్ వినిపిస్తూనే ఉంటాయి. ఇదిలా ఉంటే మల్లీశ్వరి సినిమాలోని నటించిన వారందరికి మంచి గుర్తింపు వచ్చింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో వెంకటేష్ అన్న కూతురిగా నటించిన చిన్నారి గుర్తుందా.?

ఈ సినిమాలో వెంకటేష్ అన్న కూతురిగా నటించిన చిన్నారి తన క్యూట్ మాటలతో ఆకట్టుకుంది. ఆ చిన్నారి పేరు ‘గ్రీష్మ నేత్రిక’. మల్లీశ్వరి సినిమాలో తన క్యూట్ నటనతో ఆకట్టుకుంది. ఇప్పుడు ఆమె హీరోయిన్ లుక్ లోకి మారిపోయింది. గ్రీష్మ నేత్రిక లేటెస్ట్ ఫోటోలు చూస్తే మైండ్ బ్లాక్ అవుతోంది. చిన్నది చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటించింది. అమ్ములు, మల్లీశ్వరి, అశోక్, కొంచెం ఇస్టం కొంచెం కష్టం, ప్రస్తానం, పంచాక్షరి, ఏమో గుర్రం ఎగరవచ్చు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించింది గ్రీష్మ.

ప్రస్తుతం ఈ చిన్నది సినిమాలను పక్కన పెట్టేసింది. హైదరాబాద్ లో ఓ కంపెనీలో వర్క్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. అంతే కాదు. గ్రీష్మ నేత్రిక సోషల్ మీడియాలోనూ అంతగా యాక్టివ్ గా ఉండదు. అయితే ఇప్పుడు గ్రీష్మ ఎలా ఉందో తెలుసుకోవాలని నెటిజన్స్ సోషల్ మీడియాను గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే గ్రీష్మ లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి. సినిమాలను పక్కన పెట్టేసింది కానీ ఇప్పుడు హీరోయిన్ గా మంచి క్రేజ్ తెచ్చుకునేది అంటున్నారు నెటిజన్స్.

Greeshma Nethrikaa I

 

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..