నల్లగా, చాలా లావుగా, ఛండాలంగా ఉన్నావ్ అన్నారు.. కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో తిరుగులేని హీరోయిన్ ఆమె..

చాలా మంది హీరోయిన్ అవకాశాల కోసం ఎన్నో కష్టాలు పడ్డారు. అలాగే ఎన్నో అవమానాలు కూడా ఎదుర్కొంటు సక్సెస్ అయ్యిన వారు చాలా మంది ఉన్నారు. ఆడిషన్స్ ఇచ్చుకుంటూ.. సినిమా ఆఫిసులు చుట్టూ తిరుగుతూ..సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేసుకుంటూ హీరోయిన్స్ గా మారారు. అలాంటి వారిలో పైన కనిపిస్తున్న హీరోయిన్ ఒకరు.

నల్లగా, చాలా లావుగా, ఛండాలంగా ఉన్నావ్ అన్నారు.. కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో తిరుగులేని హీరోయిన్ ఆమె..
Actress
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 12, 2024 | 10:33 AM

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ చాలా ఈజీగా ఎంట్రీ ఇస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా చాలా మంది హీరోయిన్స్ గా మారారు. కొంతమంది నటవారసులుగా కొంతమంది ఎంట్రీ ఇస్తున్నారు. కానీ అంతకు ముందు అలా కాదు.. చాలా మంది హీరోయిన్ అవకాశాల కోసం ఎన్నో కష్టాలు పడ్డారు. అలాగే ఎన్నో అవమానాలు కూడా ఎదుర్కొంటు సక్సెస్ అయ్యిన వారు చాలా మంది ఉన్నారు. ఆడిషన్స్ ఇచ్చుకుంటూ.. సినిమా ఆఫిసులు చుట్టూ తిరుగుతూ..సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేసుకుంటూ హీరోయిన్స్ గా మారారు. అలాంటి వారిలో పైన కనిపిస్తున్న హీరోయిన్ ఒకరు. నల్లగా ఉన్నావు. లావుగా ఉన్నావ్ అంటూ ఎంతో అవమానించారు. కానీ కట్ చేస్తే ఇండస్ట్రీని ఏలుతున్న హీరోయిన్ ఆమె. ఇంతకు ఆమె ఎవరో గుర్తుపట్టారా.? ఎంతోమంది డ్రీమ్ హీరోయిన్ ఆమె..

ఇది కూడా చదవండి : Independence Day: ఆగస్టు 15 అంటే మా 90’s కిడ్స్‌కు ఓ ఎమోషన్ గురూ..

పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఓ స్టార్.. దాదాపు అందరు టాప్ హీరోలతో హీరోయిన్ గా చేసింది ఈ చిన్నది. ఆమె మరెవరో కాదు బాలీవుడ్ బ్యూటీ కాజోల్.. షారుక్ ఖాన్, కాజోల్ జోడీ బాలీవుడ్లో హిట్ పెయిర్ గా పేరుతెచ్చుకున్నారు. కాజోల్ తల్లి తనూజ. ఆమె ఓ ప్రముఖ నటి. తండ్రి పేరు షోము ముఖర్జీ. ఆయన ప్రముఖ దర్శకనిర్మాత. కాజోల్ ఫ్యామిలీకి సినీ బ్యాగ్రౌండ్ ఉండటంతో పదహారేళ్లకే తొలి అవకాశం వచ్చింది. రాహుల్ రవైల్ దర్శకత్వంలో ‘బెఖుడి’లో నటించే అవకాశాన్ని సంపాదించింది.

ఇది కూడా చదవండి : Bigg Boss 8: బిగ్ బాస్ సీజన్ 8కు హోస్ట్‌గా ఆ స్టార్ హీరోయిన్.. ఫుల్ ఖుష్ అవుతున్న ఫ్యాన్స్

తాజాగా కాజోల్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. తన కెరీర్ లో ఎదుర్కొన్న అవమానాల గురించి తెలిపింది. ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో చాలా అవమానాలు ఎదుర్కొన్నాను. నల్లగా ఉన్నావ్.. చాలా లావుగా ఉన్నావ్  అని అనేవారు. ఆ సమయంలో నేను  ఆత్మవిశ్వసం కోల్పోయాను. చాలా బాధపడ్డాను. ఆతర్వాత గ్లామర్ పై జాగ్రత్తలు తీసకున్నానని, కానీ ఎలాంటి సర్జరీలు చేయించుకోలేదని తెలిపింది. కాజోల్ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించింది. స్టార్ హీరో అజయ్ దేవగన్ ను పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. అడపాదడపా సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటోంది.

View this post on Instagram

A post shared by Kajol Devgan (@kajol)

కాజోల్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

View this post on Instagram

A post shared by Kajol Devgan (@kajol)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..