Independence Day: ఆగస్టు 15 అంటే మా 90’s కిడ్స్‌కు ఓ ఎమోషన్ గురూ..

స్వాతంత్ర దినోత్సవం 90's కిడ్స్ కు అదొక పెద్ద పండగ లాంటిది. ఆగస్టు 15 వస్తుందంటే చాలు పదిరోజుల నుంచే హడావిడి మొదలయ్యేది. స్కూల్ లో డాన్స్ ప్రోగ్రామ్స్ కు పేర్లు ఇవ్వడం.. గేమ్స్ లో పేరులు ఇవ్వడం.. ఆ గేమ్స్ కోసం, డాన్స్ కోసం ప్రాక్టీస్ చేయడం భలేగా ఉండేది. క్లాస్ లో అందరం డబ్బులేసుకొని రంగు కాగితాలు, జెండాలు, బెలూన్స్ కొనుక్కొని. ఆగస్టు 15 ముందు రోజు సాయంత్రం క్లాస్ రూమ్ మొత్తం డెకరేషన్ చేసేవాళ్ళం..

Independence Day: ఆగస్టు 15 అంటే మా 90's కిడ్స్‌కు ఓ ఎమోషన్ గురూ..
August 15
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 12, 2024 | 8:51 AM

ఆ రోజులు చాలా బాగుండేవి.. మళ్ళీ తిరిగి రామన్న రాని రోజులు అవి.. కాలం ముందుకు సాగుతోంది.. టెక్నాలజీ పెరిగిపోతుంది. అందరూ అప్డేట్ అవుతున్నారు. దాంతో మనం గడిపిన ఎన్నో మధుర క్షణాలు మనతోనే చివరివి అయ్యాయి. వాటిలో ఆగస్టు 15ఒకటి. స్వాతంత్ర దినోత్సవం 90’s కిడ్స్ కు అదొక పెద్ద పండగ లాంటిది. ఆగస్టు 15 వస్తుందంటే చాలు పదిరోజుల నుంచే హడావిడి మొదలయ్యేది. స్కూల్ లో డాన్స్ ప్రోగ్రామ్స్ కు పేర్లు ఇవ్వడం.. గేమ్స్ లో పేరులు ఇవ్వడం.. ఆ గేమ్స్ కోసం, డాన్స్ కోసం ప్రాక్టీస్ చేయడం భలేగా ఉండేది. క్లాస్ లో అందరం డబ్బులేసుకొని రంగు కాగితాలు, జెండాలు, బెలూన్స్ కొనుక్కొని. ఆగస్టు 15 ముందు రోజు సాయంత్రం క్లాస్ రూమ్ మొత్తం డెకరేషన్ చేసేవాళ్ళం.. బోర్డు పై స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు అని రాసేవాళ్ళం.

ఇది కూడా చదవండి : OTT Movie : ఇదెక్కడి రచ్చ రా బాబు..! ఇద్దరమ్మాయిల మధ్య ఘాడమైన ప్రేమ.. ఎక్కడ చూడొచ్చంటే..

ఇక ఉదయాన్నే నిద్ర లేచి తలస్నానం చేసి నీట్ గా రెడీ అయ్యేవాళ్ళం. అలాగే వైట్ అండ్ వైట్ డ్రస్సు.. వైట్ షూస్ వేసుకొని స్కూల్ కు బయలుదేరేవాళ్ళం.. ఇక స్కూల్ కు వెళ్లిన తర్వాత జెండా వందనం కోసం లైన్ లో నిలుచొని జెండా ఎగరగానే జనగణమన పాడుతూనే స్వీట్ ఏం ఇస్తారా అని ఆలోచించేవాళ్ళం. ఆ తర్వాత టీచర్స్ బోరింగ్ స్పీచ్ ఉండేది. ఎదో విని విననట్టు వినేవాళ్ళం.. ఆతర్వాత మిక్చర్, స్వీట్స్ పంచిపెట్టేవాళ్ళు.

ఇది కూడా చదవండి :  Naga Chaitanya : సమంతతో ఉన్న ఫోటోను పదిలంగా దాచుకున్న నాగ చైతన్య..

ఆతర్వాత కల్చరల్ ప్రోగ్రాం .. క్లాస్ గర్ల్స్ డాన్సులు, పాటలు పాడటం ఎంజాయ్ చేసేవాళ్ళం. ఆతర్వాత ఎంతో సంతోషంతో ఇంటికి తిరిగి వెళ్ళేవాళ్ళం. ఇక ఇంటికి వెళ్లిన తర్వాత డ్రస్ మార్చుకొని టీవీ ముందు కూర్చోగానే ఖడ్గం సినిమా మొదలయ్యేది. ఖడ్గం సినిమా సినిమా కాదు ఓ ఎమోషన్ అనే చెప్పాలి. ఎన్ని సార్లు చూసిన బోరు కొట్టని మూవీ.. ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినలిపించే సాంగ్స్.. దేశభక్తి సీన్స్, ఎమోషనల్ సీన్స్ ప్రతి ఒక్కరికి కనెక్ట్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. కృష్ణవంశీ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. అలాగే దేవీ శ్రీ అందించిన మ్యూజిక్ వింటే తెలియని ఫీలింగ్ వస్తుంది. అలా మా ఆగస్టు 15 గడిచిపోయేది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!