- Telugu News Photo Gallery Cinema photos Some music directors are trying to prove themselves in the Tollywood music industry
Music Directors: తమను తాము ప్రూవ్ చేసుకునే పనిలో మ్యూజిక్ డైరక్టర్లు.. ఏమి చేస్తున్నారంటే.?
సెలక్ట్ చేసుకున్న ఫీల్డ్ లో టాప్ రేంజ్‌కి చేరాలంటే ముందు ఉనికిని చాటుకోవాలి. ఆ రంగంలో టాప్‌లో ట్రెండ్ అవుతున్నవారి గురించి తెలుసుకోవాలి. వారి పోటీని తట్టుకోవాలి. ఓ వైపు వీటన్నిటి మీద దృష్టి పెడుతూనే, ఓన్ బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలి... దేవి, తమన్‌లాంటివారు ఏలేస్తున్న టాలీవుడ్ మ్యూజిక్ ఇండస్ట్రీలో తమను తాము ప్రూవ్ చేసుకునే పనిలో ఉన్నారు కొందరు మ్యూజిక్ డైరక్టర్లు...
Updated on: Aug 12, 2024 | 2:38 PM

సెలక్ట్ చేసుకున్న ఫీల్డ్ లో టాప్ రేంజ్‌కి చేరాలంటే ముందు ఉనికిని చాటుకోవాలి. ఆ రంగంలో టాప్‌లో ట్రెండ్ అవుతున్నవారి గురించి తెలుసుకోవాలి. వారి పోటీని తట్టుకోవాలి. ఓ వైపు వీటన్నిటి మీద దృష్టి పెడుతూనే, ఓన్ బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలి.

దేవి, తమన్‌లాంటివారు ఏలేస్తున్న టాలీవుడ్ మ్యూజిక్ ఇండస్ట్రీలో తమను తాము ప్రూవ్ చేసుకునే పనిలో ఉన్నారు కొందరు మ్యూజిక్ డైరక్టర్లు. ఎవరు ఆ మ్యూజిక్ డైరెక్టర్స్.? ఇప్పుడు ఈ సినిమాలు చేస్తున్నారు.

వైవిధ్యమైన స్వరంతో మోస్ట్ వాంటెడ్ గాయకుడిగా పేరు తెచ్చుకున్నారు రామ్ మిర్యాల. ఆయన కంపోజ్ చేసిన బాణీలు కూడా జనాలను అంతే జోరుగా ఎంటర్‌టైన్‌చేశాయి. టిల్లు పాటలకు జనాలు ఎలా ఊగిపోయారో గమనించిన వారు... కళ్లు మూసుకుని రామ్ మిర్యాలకు ఛాన్సులిస్తున్నారు.. లేటెస్ట్ గా ఆయ్ పాటలను కంపోజ్ చేశారు రామ్ మిర్యాల. ఈ నెల 15న విడుదల కానుంది ఆయ్.

నెల పూర్తయ్యే వేళ మేం మొదలుపెడతాం అంటూ సరిపోదా శనివారం ప్రమోషన్లు చేశారు నాని. నా వంతు నేను కూడా జనాలను థియేటర్లకు తీసుకొస్తానని అంటున్నారు సంగీత దర్శకుడు జేక్స్ బిజోయ్. నాని సరిపోదా శనివారం సినిమాకు మాత్రమే కాదు, విశ్వక్‌సేన్ మెకానిక్ రాకీ కి కూడా ఆయనే స్వరకర్త.

చిన్న సినిమాలు పెద్దగా జనాల్లోకి రీచ్ కావాలంటే ఎక్కువగా డిపెండ్ అయ్యేది మ్యూజిక్ మీదే. కమిటీ కుర్రోళ్లు లాంటి చిన్న సినిమాకు ఆశా కిరణంగా కనిపిస్తున్నారు అనుదీప్ దేవ్. నీహా రిక కొణిదెల ప్రొడక్షన్‌లో రూపొందిన సినిమా కమిటీ కుర్రోళ్లు. ఇటీవల విడుదలైన ఈ సినిమాలోని పాటలకు మాస్‌లో మంచి ఆదరణ లబించింది.




