- Telugu News Photo Gallery Cinema photos Mahesh Babu Family Enjoy Vacation In Rajasthan, Photos Goes Viral
Mahesh Babu: రాజస్థాన్‌లో మహేశ్ బాబు ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా సితార.. ఫొటోస్ చూశారా?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇటీవలే తన పుట్టిన రోజు (ఆగస్టు 09)ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు సూపర్ స్టార్ కు ర్త్ డే విషెస్ చెప్పారు. ఇదిలా ఉంటే ప్రస్తుతంమహేశ్ బాబు ఫ్యామిలీ రాజస్థాన్ లో సేద తీరుతోంది.
Updated on: Aug 11, 2024 | 9:25 PM

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇటీవలే తన పుట్టిన రోజు (ఆగస్టు 09)ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు సూపర్ స్టార్ కు ర్త్ డే విషెస్ చెప్పారు. ఇదిలా ఉంటే ప్రస్తుతంమహేశ్ బాబు ఫ్యామిలీ రాజస్థాన్ లో సేద తీరుతోంది.

మహేశ్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్, కూతురు ఘట్టమనేని సితార, కుమారుడు గౌతమ్ లు రాజస్థాన్ పర్యటనకు వెళ్లారు. వారి వెంట స్నేహితులు కూడా ఉన్నారు.

రాజస్థాన్ లోని పలు పర్యాటక ప్రదేశాలతో పాటు షాపింగ్ చేస్తూ ఫొటోలకు పోజులిచ్చారు. ప్రస్తుతం మహేశ్ ఫ్యామిలీ రాజస్థాన్ వెకేషన్ కు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి.

కాగా మహేశ్ బాబు పుట్టిన రోజు వేడుకలు రాజస్థాన్ రాజధాని జైపూర్ లోనే జరిగినట్లు తెలుస్తోంది. వెకేషన్ ను పూర్తి చేసుకున్న వార ఆదివారం(ఆగస్టు 11) తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు

ఇక సినిమాల విషయానికి వస్తే..ఈ ఏడాది సంక్రాంతికి గుంటూరు కారంతో అలరించిన మహేశ్ బాబు ఇప్పుడు రాజమౌళితో ఒక సినిమా చేస్తున్నాడు.

త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పట్టాలెక్కనుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇక ఈ సినిమా కోసమే మహేష్ తన పూర్తి లుక్‌ను మార్చేశారు