Mrunal Thakur: లిప్ లాక్ సీన్స్.. చాలా అవకాశాలు కోల్పోయాను.. మృణాల్ ఠాకూర్ షాకింగ్ కామెంట్స్..
సీతారామం సినిమాతో తెలుగు అడియన్స్ హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది హీరోయిన్ మృణాల్ ఠాకూర్. తొలి చిత్రంతోనే కథానాయికగా ప్రశంసలు అందుకున్న మృణాల్ ఆ తర్వాత మాత్రం తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటూ స్టార్ డమ్ సొంతం చేసుకుంది. మొదట్లో బుల్లితెరపై పలు సీరియల్స్ చేసిన ఈ బెంగాలీ బ్యూటీ.. ఆ తర్వాత మాతృభాషతోపాటు హిందీలో పలు సినిమాల్లో నటించింది.