ఈ నటుడి భార్య, కూతురు స్టార్ హీరోయిన్స్.. ఇద్దరూ బాలయ్య బాబుతో నటించారు

ఆర్ఎక్స్ 100 సినిమాలో ఆయన పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. ఆయన పూర్తి పేరు రామకృష్ణ. ఒకప్పుడు రామ్‌కీ హీరోగా నటించి ప్రేక్షకులను మెప్పించాడు. హీరోగా పలు సినిమాల్లో నటించాడు రామ్‌కీ . ఘటన, భలే ఖైదీలు, దోషి వంటి సినిమాల్లో నటించాడు. అలాగే విజయశాంతి ప్రధాన పాత్రలో నటించిన ఒసేయ్ రాములమ్మల్లో చిన్న పాత్రలో నటించాడు.

ఈ నటుడి భార్య, కూతురు స్టార్ హీరోయిన్స్.. ఇద్దరూ బాలయ్య బాబుతో నటించారు
Ramki
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 12, 2024 | 11:57 AM

పై ఫొటోలో ఉన్న నటుడిని గుర్తుపట్టారా.? ఆర్ఎక్స్ 100 సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఆర్ఎక్స్ 100 సినిమాలో డాడీ పాత్రలో నటించాడు ఆయన. ఆయన పేరు రామ్‌కీ. ఈ సినిమాలో హీరో తండ్రిగా ఉంటూ పెళ్లి చేసుకోకుండా ఊర్లో కుర్రాళ్లకు పెద్ద దిక్కుగా ఉంటాడు. ఆర్ఎక్స్ 100 సినిమాలో ఆయన పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. ఆయన పూర్తి పేరు రామకృష్ణ. ఒకప్పుడు రామ్‌కీ హీరోగా నటించి ప్రేక్షకులను మెప్పించాడు. హీరోగా పలు సినిమాల్లో నటించాడు రామ్‌కీ . ఘటన, భలే ఖైదీలు, దోషి వంటి సినిమాల్లో నటించాడు. అలాగే విజయశాంతి ప్రధాన పాత్రలో నటించిన ఒసేయ్ రాములమ్మల్లో చిన్న పాత్రలో నటించాడు. అయితే ఈ నటుడి భార్యను ఎప్పుడైనా చూశారా.. ? ఆయన భార్య ఎవరో తెలిస్తే షాక్ అవుతారు.

ఇది కూడా చదవండి : నల్లగా, చాలా లావుగా, ఛండాలంగా ఉన్నావ్ అన్నారు.. కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో తిరుగులేని హీరోయిన్ ఆమె..

ఆయన భార్య ఓ హీరోయిన్.. ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్ గా సినిమాలు చేసింది ఆమె పేరు నిరోషా. రామ్‌కీ, నిరోషా కలిసి సింధురపువ్వు అనే సినిమా చేశారు. ఈ సినిమాలోని సిందూర పువ్వా.. అంటూ సాగే సాంగ్ సూపర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే.. ఈ సినిమా సమయంలోనే నిరోషా, రామ్‌కీ ప్రేమలో పడ్డారు. నిరోషా బాలకృష్ణ, చిరంజీవి, రాజేంద్ర ప్రసాద్, మోహన్ బాబు.. ఇలా పలువురు స్టార్ హీరోలతో కలిసి సినిమాలు చేసింది. బాలయ్య సరసన నారి నారి నడుమ మురారి సినిమాలో హీరోయిన్ గా నటించింది.

ఇది కూడా చదవండి : Mahesh Babu: మహేష్ బాబు దెబ్బకు బ్యాగ్రౌండ్ బయట పెట్టిన అక్కినేని కోడలు..

తెలుగులో నిరోషా దాదాపు 30 సినిమాల్లో నటించింది. అలాగే తమిళ్ లో ఆమె ఎక్కువ సినిమాలు చేసింది. అక్కడ దాదాపు 100 సినిమాలు చేసింది నిరోషా. 1995లో నిరోష, రామ్‌కీని పెళ్లి చేసుకుంది. ఇక రామ్‌కీకి ఓ అన్న కూడా ఉన్నాడు. ఆయన ఎవరో కాదు సీనియర్ హీరో శరత్ కుమార్. ఆయన కూతురు వరలక్ష్మీ రామ్‌కీకి వరసకు కూతురు అవుతుంది. రాధిక శరత్ కుమార్.. రామ్‌కీకు వదిన అవుతుంది. చాలా మందికి రామ్‌కీకి ఫ్యామిలీ గురించి తెలియకపోవచ్చు. రామ్‌కీ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అలాగే నిరోషా కూడా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. కాగా నిరోషా , వరలక్ష్మీ ఇద్దరూ బాలకృష్ణతో కలిసి నటించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..