బిగ్ బాస్ నుంచి కమల్ హాసన్ ఔట్.. నెక్ట్స్ ఎవరు మరి ??
బిగ్ బాస్ షోకు కేవలం తెలుగులోనే కాదు.. తమిళంలో కూడా మంచి డిమాండ్ ఉంది. అక్కడ కూడా ఈ షో కొన్ని సీజన్స్ నుంచి విజయవంతంగా రన్ చేస్తూనే ఉన్నారు. మన దగ్గర ఎలాగైతే నాగార్జున హోస్టుగా సెట్ అయిపోయాడో.. తమిళంలో కమల్ హాసన్ అలా ఫిక్స్ అయిపోయాడు. మన దగ్గర మొదటి సీజన్ జూనియర్ ఎన్టీఆర్.. రెండో సీజన్ నాని చేశారు. కానీ తమిళంలో మాత్రం అలా కాదు. మొదటి సీజన్ నుంచి లోక నాయకుడు అక్కడ హోస్ట్ గా ఉన్నారు.