- Telugu News Photo Gallery Cinema photos Chiranjeevi and prabhas are making movies quickly post covid
పోస్ట్ కోవిడ్.. స్పీడు మీదున్న స్టార్ ఎవరో తెలుసా ??
ఆఫ్టర్ కోవిడ్.. మన హీరోల్లో మరింత యాక్టివ్‌గా ఉండేది ఎవరు? సీనియర్లా? జూనియర్లా? ప్యాన్ ఇండియన్ స్టార్లా? ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నవారా? ఆల్రెడీ ప్రూవ్డ్ స్టార్లా... ఎన్ని రకాలుగా ఆరా తీసినా... ఒక్కో జోనర్‌కి ఒక్కో స్టార్ కనిపిస్తూనే ఉన్నారు. ఇంతకీ వారందరూ ఎవరు? మాట్లాడుకుందాం వచ్చేయండి... ఇప్పుడు మాట్లాడుకోబోయే విషయం వింటే తప్పకుండా పార్టీ ఇవ్వాల్సిందే మెగా ఫ్యాన్స్.
Updated on: Aug 13, 2024 | 11:56 AM

అసలే సీక్వెల్స్ సందడి చేస్తున్న వేళ ఇంద్ర సీక్వెల్ వస్తే.. ఆ హైప్ ఇంకో రకంగా ఉంటుందిగా. ఇంద్ర గురించి ప్రస్తావన రాగానే, చిరంజీవి మనసులో మెదిలిన మూవీ జగదేకవీరుడు అతిలోక సుందరి.

చిరు కోసం మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న మెసేజ్ ఓరియంటెడ్ కథను సిద్ధం చేసినట్టుగా చెప్పారు. ఇప్పటికే కథ విన్న చిరు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారు. ఠాగూర్ తరువాత మరోసారి ఆ రేంజ్ కథ కావటంతో దర్శకుడిగా ఎవరిని తీసుకోవాలన్న విషయంలో ఆలోచనలో పడ్డారు చిరు.

ఇంతకీ బాస్ బర్త్ డేకి రెడీ అవుతున్న సర్‌ప్రైజ్‌లేంటో తెలుసా.? మీకు పార్టీ కావాలి.. అంతే కదా.. అస్సలు ఆలోచించకుండా బర్త్ డే రోజు థియేటర్లకు వచ్చేయండి.. ఒకటేంటి?

కానీ సడన్‌గా ఈ లైనప్ మారిపోయింది. స్పిరిట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఆలస్యం కావటంతో ఈ గ్యాప్‌లో మరో మూవీని పట్టాలెక్కించారు డార్లింగ్.

ఇప్పుడు కూడా ఆయన చేతిలో నాలుగు సినిమాలున్నాయని గుర్తుచేస్తున్నారు రెబల్ సైన్యం. వీళ్లందరినీ చూశాక.. మా స్టార్ స్కోర్ ఎంత అని లెక్కలేసుకుంటున్నారు మిగిలిన హీరోల ఫ్యాన్స్.




