Jyothi : ఒకప్పుడు ఇండస్ట్రీని ఊపేసింది.. ఇప్పుడు సినిమాలకు దూరంగా.. నటి జ్యోతికి ఇంత పెద్ద కొడుకు ఉన్నారా.. ?
ఒకప్పుడు తెలుగు సినిమా ప్రపంచాన్ని ఊపేసిన తారలు చాలా మంది ఉన్నారు. హీరోయిన్స్ కాకపోయిన సైడ్ క్యారెక్టర్స్ పోషిస్తూ.. అప్పుడప్పుడు స్పెషల్ పాటలతో అదరగొట్టారు. అందులో జ్యోతి ఒకరు. ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి మెప్పించింది జ్యోతి. ఇంతకీ ఆమె మీకు గుర్తుందా.. ?

నటి జ్యోతి గుర్తుందా.. ? తెలుగులో ఒకప్పుడు ఫేమస్ నటి. అనేక సినిమాల్లో కీలకపాత్రలు పోషించి గుర్తింపు తెచ్చుకుంది. అప్పట్లో ఆమెకు ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉండేది. తెలుగులో ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన జ్యోతి.. బిగ్ బాస్ సీజన్ 1లో పాల్గొని తెలుగు సినీప్రియులకు మరింత దగ్గరయ్యింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. తెలుగులో ఎవడిగోలవాడిది, గుడుంబా శంకర్, మహత్మ, దరువు, రంగ ది దొంగ, కెవ్వు కేక వంటి చిత్రాలతో పాపులర్ అయ్యింది. ఆ తర్వాత నెమ్మదిగా సినిమాలకు దూరమయ్యింది. చివరగా 2020లో వచ్చిన గోల గోల సినిమాలో కనిపించింది. ఆ తర్వాత మరో సినిమా చేయలేదు.
ఇవి కూడా చదవండి : Cinema : 64 ఏళ్ల హీరో సరసన 27 ఏళ్ల హీరోయిన్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..
చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న జ్యోతి.. ఇప్పుడు కొత్తింట్లోకి అడుగుపెట్టింది. తన కొడుకుతో కలిసి కొత్తింట్లోకి గృహప్రవేశం చేసిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో సెలబ్రెటీలు, నెటిజన్స్ జ్యోతికి కంగ్రాట్స్ చెబుతున్నారు. అలాగే జ్యోతి కొడుకును చూసి ఆశ్చర్యపోతున్నారు. ఆమెకు ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి : Actress: కేకపెట్టిందిరోయ్.. గ్లామర్ ఫోజులతో సెగలు పుట్టించిన సీరియల్ బ్యూటీ.. హీటెక్కిస్తోన్న వయ్యారి..
జ్యోతి పర్సనల్ విషయానికి వస్తే.. చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్న జ్యోతి.. ఆ తర్వాత భర్తతో ఇబ్బందులు రావడంతో విడాకులు తీసుకుంది. అప్పటి నుంచి తన కొడుకును పెంచుకుంటూ ఒంటరిగానే ఉంటుంది. అయితే ఎప్పుడూ తన కొడుకును మీడియా ముందుకు తీసుకురాలేదు. అలాగే బయటి ప్రపంచానికి దూరంగా ఉంచుంది. చాలా కాలం తర్వాత తన కొడుకుతో కలిసి ఫోటోస్ షేర్ చేసింది.
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Meenakshi Chaudhari: ఆ హీరో సినిమాలో నటించి తప్పు చేశాను.. వారం రోజులు అలాంటి బాధ.. మీనాక్షి చౌదరి..




