AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Venu Yeldandi: జబర్దస్త్ నుంచి బయటకు వచ్చాక ఎన్నో కష్టాలు.. నాపై ఆ ముద్ర వేశారు.. డైరెక్టర్ వేణు యెల్దండి..

దర్శకుడు వేణు యెల్దండి. ఒకప్పుడు కమెడియన్ గా అలరించాడు. అలాగే సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల బలగం మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ మూవీతో దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు ఎల్లమ్మ సినిమాతో మరోసారి అడియన్స్ ముందుకు రాబోతున్నాడు.

Venu Yeldandi: జబర్దస్త్ నుంచి బయటకు వచ్చాక ఎన్నో కష్టాలు.. నాపై ఆ ముద్ర వేశారు.. డైరెక్టర్ వేణు యెల్దండి..
Director Venu Yeldandi
Rajitha Chanti
|

Updated on: Jan 20, 2026 | 2:13 PM

Share

దర్శకుడు వేణు యెల్దండి.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ఒకప్పుడు కమెడియన్ గా అలరించిన వేణు..ఇప్పుడు దర్శకుడిగా విజయం సాధిస్తున్నారు. బలగం సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అయిన వేణు.. ఇప్పుడు ఎల్లమ్మ సినిమాతో అడియన్స్ ముందుకు రాబోతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో వేణు మాట్లాడుతూ.. జబర్దస్త్‌లో తన ప్రస్థానం, దాని నుండి బయటకు వచ్చి సినిమా రంగంలో స్థిరపడాలనే తన ప్రయత్నాలను పంచుకున్నారు. 2004 నుండి 2015 వరకు నటుడిగా నిరంతరం బిజీగా ఉన్నానని, రోజుకు మూడు నాలుగు షూటింగ్‌లు, ఈవెంట్‌లతో నెలలో వారం మాత్రమే ఇంట్లో గడిపానని వేణు వివరించారు. 2013లో ప్రారంభమైన జబర్దస్త్ ఆయన కెరీర్‌లో ఒక కీలక మలుపు అని, ప్రారంభంలో కేవలం నాలుగు రోజులకు అంగీకరించి 13 ఎపిసోడ్‌లకు ఒప్పందం చేసుకున్నానని తెలిపారు. ఆ షో అనూహ్య విజయం సాధించి, గురువారం వస్తే ప్రేక్షకులు ఎదురుచూసేంత క్రేజ్ సంపాదించిందని గుర్తుచేసుకున్నారు.

తొలి ఒప్పందం ముగిసిన తర్వాత, నిర్వాహకులు వేణును కొనసాగించమని బ్రతిమలాడి రెమ్యూనరేషన్ రెట్టింపు చేశారని. అలా మరో 13 ఎపిసోడ్‌లు (మొత్తం 27 ఎపిసోడ్‌లు) చేశానని అన్నారు.. జబర్దస్త్ తెలుగు రాష్ట్రాలలో ఒక బ్రాండ్‌గా మారిపోయినప్పటికీ, వేణు మాత్రం తన సినీ కలను నెరవేర్చుకోవాలనే తపనతో ఉన్నానని తెలిపారు. షో ఇచ్చిన పేరు, డబ్బు, ఇతర షోలు, ఈవెంట్‌ల ద్వారా వచ్చిన ఆదాయం అన్నీ ఉన్నప్పటికీ, తన అసలు లక్ష్యం సినిమా అని, టీవీకి పరిమితమైతే సినిమాకు దూరం అవుతానని గ్రహించి 2015 మధ్యలో జబర్దస్త్ నుండి బయటకు వచ్చినట్లు తెలిపారు. లక్షల రూపాయల ఆదాయాన్ని వదులుకోవడం, ఆర్థికంగా స్థిరపడాలనే ఆలోచనను పక్కన పెట్టి సినిమా కోసం బయటకి రావడం ఒక పెద్ద సాహసమని ఆయన పేర్కొన్నారు.

ఎక్కువమంది చదివినవి : Actor : అమ్మోరు సినిమా వల్లే నా కెరీర్‏ని నాశనం.. సగం షూట్ అయ్యాక.. నటుడు సంచలన కామెంట్స్..

జబర్దస్త్ నుండి బయటకు వచ్చిన తర్వాత, “టీవీ నటుడు” అనే ముద్ర పడి సినిమా అవకాశాలు తగ్గాయని వేణు తెలిపారు. దీనితో తీవ్ర నిరాశకు గురై, మళ్లీ ఒక సంవత్సరం పాటు జబర్దస్త్‌లో కొనసాగారు. అయితే డబ్బు కోసం తిరిగి వచ్చినట్లు అనిపించినా, లోపల తన మనస్సు సినిమా వైపే ఉండటంతో మళ్లీ బయటకు వచ్చారు. 2015 మధ్య నుండి 2020 వరకు దాదాపు ఐదేళ్లపాటు వేణు కెరీర్‌లో అత్యంత కష్టతరమైన దశ అని, ఈ కాలంలో తీవ్రమైన ఆర్థిక, మానసిక ఒడిదుడుకులను ఎదుర్కొన్నానని చెప్పారు. రోజుకు లక్షల్లో సంపాదించిన తాను, నిరుద్యోగిగా మారడం, ఎలాంటి పనిలేకపోవడం తనను చాలా బాధించిందని అన్నారు. “అనవసరంగా దాని నుంచి బయటకు వచ్చాను, ఇప్పుడంతా పోయింది, తప్పు చేశానా” అనే “గిల్ట్” తనను నిరంతరం వేధించిందని వేణు వెల్లడించారు. ఇప్పుడు ఎల్లమ్మ సినిమాతో అడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఇందులో దేవి శ్రీ ప్రసాద్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఎక్కువమంది చదివినవి : Anantha Sriram: యూత్‏కు పిచ్చేక్కించేసిన పాట.. ఆ సాంగ్‏తో నా జీవితమే మారిపోయింది.. రచయిత అనంత్ శ్రీరామ్..