AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rohit – Virat: సిరీస్ ఓటమి.. రోహిత్, కోహ్లీలకు బిగ్ షాక్ ఇవ్వనున్న బీసీసీఐ.. అదేంటంటే..?

Rohit Sharma and Virat Kohli Salary Cut: టీమిండియా దిగ్గజ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) గట్టి షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. 2026 కొత్త సెంట్రల్ కాంట్రాక్టులలో వీరిద్దరి గ్రేడ్‌ను తగ్గించి, జీతాల్లో కోత విధించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కేవలం వన్డే ఫార్మాట్‌కే పరిమితమైన వీరిపై ఈ నిర్ణయం ఏ మేరకు ప్రభావం చూపుతుందో ఇప్పుడు చూద్దాం.

Rohit - Virat: సిరీస్ ఓటమి.. రోహిత్, కోహ్లీలకు బిగ్ షాక్ ఇవ్వనున్న బీసీసీఐ..  అదేంటంటే..?
Rohit Virat
Venkata Chari
|

Updated on: Jan 20, 2026 | 1:58 PM

Share

Rohit Sharma and Virat Kohli Salary Cut: భారత క్రికెట్ చరిత్రలో తిరుగులేని ముద్ర వేసిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు సంబంధించిన ఒక చేదు వార్త ఇప్పుడు క్రీడా లోకంలో హాట్ టాపిక్‌గా మారింది. 2026 సంవత్సరానికి సంబంధించి బీసీసీఐ ప్రకటించనున్న వార్షిక ఒప్పందాల్లో (Central Contracts) ఈ స్టార్ ప్లేయర్ల హోదాను తగ్గించే అవకాశం ఉన్నట్లు జాతీయ మీడియా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

‘ఏ ప్లస్’ కేటగిరీ రద్దు?

అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ బీసీసీఐకి కొన్ని కీలక ప్రతిపాదనలు చేసింది. దీని ప్రకారం, ప్రస్తుతం ఉన్న ‘ఏ ప్లస్’ (Grade A+) కేటగిరీని పూర్తిగా రద్దు చేసి, కేవలం ఏ, బీ, సీ (A, B, C) గ్రేడ్‌లను మాత్రమే ఉంచాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ‘ఏ ప్లస్’ కేటగిరీలో ఉన్న ప్లేయర్లకు ఏడాదికి రూ. 7 కోట్ల జీతం అందుతోంది. ఒకవేళ ఈ గ్రేడ్ రద్దయితే, సీనియర్ ఆటగాళ్లు రోహిత్, కోహ్లీలు గ్రేడ్ ‘బి’కి పడిపోయే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.

ఎందుకు ఈ నిర్ణయం?

సాధారణంగా మూడు ఫార్మాట్లు (టెస్టులు, వన్డేలు, టీ20లు) ఆడే ఆటగాళ్లకు బీసీసీఐ అత్యధిక ప్రాధాన్యతనిస్తూ ‘ఏ ప్లస్’ గ్రేడ్ ఇస్తుంది.

ఇవి కూడా చదవండి

రిటైర్మెంట్ ప్రభావం: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఇప్పటికే టెస్టులు, టీ20ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు.

ఫార్మాట్ పరిమితి: ప్రస్తుతం వీరు కేవలం వన్డే ఫార్మాట్ మాత్రమే ఆడుతున్నారు.

నిబంధనలు: కేవలం ఒక ఫార్మాట్‌కే పరిమితమైన ఆటగాళ్లకు టాప్ గ్రేడ్ ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమని సెలక్టర్లు భావిస్తున్నారు.

జీతాల్లో భారీ కోత..

ప్రస్తుతం రోహిత్, కోహ్లీలు ఏటా రూ. 7 కోట్లు అందుకుంటున్నారు. ఒకవేళ వీరిని గ్రేడ్ ‘ఎ’ (రూ. 5 కోట్లు) లేదా గ్రేడ్ ‘బి’ (రూ. 3 కోట్లు)కి డిమోట్ చేస్తే, వీరి ఆదాయంలో రూ. 2 కోట్ల నుంచి రూ. 4 కోట్ల వరకు కోత పడే అవకాశం ఉంది. జస్‌ప్రీత్ బుమ్రా వంటి మూడు ఫార్మాట్లు ఆడే ప్లేయర్లు మాత్రమే టాప్ లిస్టులో కొనసాగనున్నారు.

శుభ్‌మన్ గిల్‌కు జాక్‌పాట్.. !

ఒకవైపు సీనియర్లకు నిరాశ ఎదురవుతుంటే, యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్‌కు మాత్రం ప్రమోషన్ లభించనుంది. ప్రస్తుతం మూడు ఫార్మాట్లలోనూ రాణిస్తూ, టెస్ట్, వన్డే కెప్టెన్సీ రేసులో ఉన్న గిల్‌ను టాప్ కేటగిరీకి ప్రమోట్ చేయాలని బీసీసీఐ యోచిస్తోంది. అలాగే రిషబ్ పంత్ కూడా తిరిగి అగ్రశ్రేణి గ్రేడ్‌లోకి వచ్చే అవకాశం ఉంది.

అంతిమ నిర్ణయం ఎప్పుడు? ఈ మార్పులపై బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌లో తుది నిర్ణయం తీసుకోనున్నారు. అయితే, సదరు దిగ్గజాల సేవలను గౌరవిస్తూ వారిని ఏ కేటగిరీలో ఉంచుతారనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..

రోహిత్, కోహ్లీలకు బీసీసీఐ బిగ్ షాక్.. భారీగా తగ్గించిన జీతాలు..
రోహిత్, కోహ్లీలకు బీసీసీఐ బిగ్ షాక్.. భారీగా తగ్గించిన జీతాలు..
ఇంటిలో వేప చెట్టు ఉండటం మంచిదేనా?
ఇంటిలో వేప చెట్టు ఉండటం మంచిదేనా?
గోంగూర గొప్పతనం ఇదే మరీ.. రోజూ గుప్పెడు తిన్నారంటే..ఆ సమస్యలన్నీ
గోంగూర గొప్పతనం ఇదే మరీ.. రోజూ గుప్పెడు తిన్నారంటే..ఆ సమస్యలన్నీ
ఆర్టీసికి అసలైన పండగ తెచ్చిన సంక్రాంతి.. కలెక్షన్లలో అదిరే..
ఆర్టీసికి అసలైన పండగ తెచ్చిన సంక్రాంతి.. కలెక్షన్లలో అదిరే..
ఆగడు విషయంలో తప్పు జరిగిందక్కడే.. సెకండాఫ్ అలా చేసి ఉంటే
ఆగడు విషయంలో తప్పు జరిగిందక్కడే.. సెకండాఫ్ అలా చేసి ఉంటే
ఎక్కువ క్రెడిట్ కార్డులు వాడేవారికి హెచ్చరిక.. జాగ్రత్తలు ఇవే..
ఎక్కువ క్రెడిట్ కార్డులు వాడేవారికి హెచ్చరిక.. జాగ్రత్తలు ఇవే..
నాగ్‌పూర్‌లో కివీస్‌కు నరకం చూపించే బ్యాచ్.. ఫోకస్ ఇద్దరిపైనే..?
నాగ్‌పూర్‌లో కివీస్‌కు నరకం చూపించే బ్యాచ్.. ఫోకస్ ఇద్దరిపైనే..?
బాప్‌రే.. బ్లూ బెర్రీస్ తింటే ఇన్ని లాభాలా..? అస్సలు వదలకండి
బాప్‌రే.. బ్లూ బెర్రీస్ తింటే ఇన్ని లాభాలా..? అస్సలు వదలకండి
నోరూరించే కోడి గుడ్డు పచ్చడి.. ఇంట్లోనే ఇలా సింపుల్‌గా చేయండి!
నోరూరించే కోడి గుడ్డు పచ్చడి.. ఇంట్లోనే ఇలా సింపుల్‌గా చేయండి!
సినిమాలో వద్దన్నాడు.. రాజకీయాల్లో ఇస్తాన్నాడు.. కరుణానిధి, జయలలిత
సినిమాలో వద్దన్నాడు.. రాజకీయాల్లో ఇస్తాన్నాడు.. కరుణానిధి, జయలలిత