సంక్రాంతి విజయాల తర్వాత, టాలీవుడ్లో ఈ సమ్మర్ సీజన్‌పై భారీ అంచనాలున్నాయి. గత మూడు సంవత్సరాలుగా డల్‌గా ఉన్న వేసవిని ఈసారి యాక్షన్ ప్యాక్డ్ చిత్రాలతో నింపేందుకు సిద్ధమవుతున్నారు హీరోలు. మార్చిలో టాక్సిక్, నాని పారడైజ్, రామ్ చరణ్ పెద్ది వంటి సినిమాలు విడుదల కానున్నాయి. చిరంజీవి విశ్వంభర, పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఈ జాబితాలో ఉన్నాయి.