AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మన పూర్వీకులు తిన్న ఈ ఆహారంలో ఇన్ని సీక్రెట్స్ ఉన్నాయా.. తింటే ఒక్క నెలలోనే ఎన్నో అద్భుతాలు..

ఒకప్పుడు మన తాతల కాలంలో సజ్జ రొట్టె అంటే బలమైన ఆహారం. మధ్యలో మనం దాన్ని మర్చిపోయి పాలిష్ చేసిన బియ్యానికి అలవాటు పడ్డాం. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. మళ్ళీ సిరి ధాన్యాల కాలం మొదలైంది. షుగర్ లెవల్స్‌ను మ్యాజిక్‌లా కంట్రోల్ చేయడంలో గుండెను పదిలంగా ఉంచడంలో సజ్జలకు మించిన ఆహారం లేదని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ సజ్జలలో దాగున్న ఆ అద్భుత పోషకాలు ఏంటి?

మన పూర్వీకులు తిన్న ఈ ఆహారంలో ఇన్ని సీక్రెట్స్ ఉన్నాయా.. తింటే ఒక్క నెలలోనే ఎన్నో అద్భుతాలు..
Health Benefits Of Pearl Millet
Krishna S
|

Updated on: Jan 20, 2026 | 2:06 PM

Share

ఒకప్పుడు పల్లెటూళ్లలో సజ్జ రొట్టెలు, సజ్జ జావ ప్రధాన ఆహారంగా ఉండేవి. కాలక్రమేణా మరుగున పడిన ఈ సిరి ధాన్యం మళ్ళీ ఇప్పుడు వెలుగులోకి వస్తోంది. మారిన జీవనశైలి కారణంగా వస్తున్న వ్యాధులను తరిమికొట్టే శక్తి సజ్జలకు ఉందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. శరీరానికి శక్తినివ్వడమే కాకుండా కండరాల పటుత్వానికి ఇవి ఎలా తోడ్పడతాయో ఇప్పుడు చూద్దాం.

డయాబెటిస్ నియంత్రణలో నంబర్ 1

మధుమేహ వ్యాధిగ్రస్తులకు సజ్జలు ఒక వరం. దీనికి ప్రధాన కారణం వీటిలో ఉండే తక్కువ గ్లైసీమిక్ ఇండెక్స్. సజ్జలు తిన్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగవు. వీటిలో ఉండే అధిక ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఇన్సులిన్ పనితీరును మెరుగుపరుస్తాయి.

గుండె పదిలం.. బీపీ అదుపు

సజ్జలలో ఉండే పొటాషియం, మెగ్నీషియం రక్తనాళాలపై ఒత్తిడిని తగ్గించి హైబీపీని నియంత్రణలో ఉంచుతాయి. వీటిలోని ఫైబర్ రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండెపోటు ముప్పును నివారిస్తుంది.గుండె కండరాలను బలోపేతం చేయడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.

బరువు తగ్గాలనుకునే వారికి..

బరువు తగ్గడానికి కఠినమైన డైటింగ్ చేసే బదులు సజ్జలను ఆహారంలో చేర్చుకోవడం ఉత్తమం. వీటిలో ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉండటం వల్ల కొద్దిగా తిన్నా కడుపు నిండినట్లు అనిపిస్తుంది. దీనివల్ల అతిగా తినడం తగ్గుతుంది. మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలతో బాధపడేవారికి సజ్జలు అద్భుతంగా పనిచేస్తాయి.

కండరాల పటుత్వం – రోగనిరోధక శక్తి

వ్యాయామం చేసేవారికి, శారీరక శ్రమ అధికంగా ఉండేవారికి సజ్జలు గొప్ప శక్తినిస్తాయి. సజ్జలలో ఉండే థయామిన్, నియాసిన్ వంటి బి-విటమిన్లు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. నీరసం, అలసట దరిచేరవు. వీటిలో ఉండే నాణ్యమైన ప్రోటీన్లు కండరాల నిర్మాణానికి, దృఢత్వానికి తోడ్పడతాయి. పాస్పరస్ ఎముకలను బలోపేతం చేస్తే జింక్ రోగనిరోధక శక్తిని పెంచి గాయాలు త్వరగా మానేలా చేస్తుంది.

ప్రస్తుత కాలంలో మహిళలు, పిల్లల్లో రక్తహీనత ఎక్కువగా కనిపిస్తోంది. సజ్జలలో ఉండే సహజ సిద్ధమైన ఐరన్ రక్తాన్ని వృద్ధి చేయడంలో ఎంతో మేలు చేస్తుంది. వారానికి కనీసం మూడు సార్లు సజ్జ రొట్టెలు లేదా సజ్జ జావను మీ డైట్‌లో చేర్చుకోండి. ఇవి కేవలం ఆహారం మాత్రమే కాదు, మీ శరీరాన్ని లోపలి నుంచి శుద్ధి చేసే ఔషధాలు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..