Watch Video: బర్త్ డే పార్టీలో గొడ్డలితో కేక్ కట్ చేసిన యువకులు.. ఊరి జనం గుండెళ్లో గుబులు! వీడియో
కృష్ణాజిల్లా మచిలీపట్నం పెద్దపట్నం గ్రామంలో పుట్టినరోజు వేడుకల పేరుతో చోటుచేసుకున్న సంఘటన గ్రామంలో తీవ్ర కలకలం రేపుతోంది. మద్యం మత్తులో ఉన్న కొందరు యువకులు గొడ్డలితో కేక్ కట్ చేస్తూ హంగామా చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది..

మచిలీపట్నం, జనవరి 20: కృష్ణాజిల్లా పెద్దపట్నం గ్రామానికి చెందిన సతీష్ , రాంకీ , రాజేష్ , సంతోష్ కుమార్ అనే యువకులు పుట్టినరోజు వేడుకల్లో భాగంగా గొడ్డలిని ఉపయోగించి కేక్ కట్ చేసినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ దృశ్యాలు గ్రామస్తులలో ఆందోళనకు దారి తీశాయి. పండుగలు , వేడుకలు ఆనందంగా జరుపుకోవాలని ఇలాంటి ప్రమాదకరమైన చర్యలు సమాజానికి తప్పుడు సందేశం ఇస్తున్నాయని గ్రామ పెద్దలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. అయితే గ్రామస్తుల సమాచారం మేరకు అదే యువకులు డిసెంబర్ 31వ తేదీన కూడా మద్యం సేవించి గ్రామంలో తిరుగుతూ యువతతో పాటు మహిళలు , వృద్ధులను భయపెట్టే విధంగా ప్రవర్తించారని ఆరోపణలు ఉన్నాయి.. అర్ధరాత్రి వరకు అరుపులు , కేకలు వేస్తూ గ్రామంలో ఆందోళన వాతావరణాన్ని సృష్టించారని చెబుతున్నారు..
అంతేకాదు కనుమ పండుగ రోజు కూడా ఈ యువకులు పూర్తిగా మద్యం మత్తులో గ్రామంలో హల్ చల్ చేశారని గ్రామస్తులు వాపోతున్నారు.. పండుగ వేళ ప్రశాంతంగా ఉండాల్సిన గ్రామంలో మళ్లీ ఇలాంటి ఘటనలు జరగడం ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ఇదిలా ఉండగా గొడ్డలితో కేక్ కట్ చేసిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు ఈ ఘటనపై ప్రత్యేక దృష్టి సాధించి దర్యాప్తు చేస్తున్నారు.. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా చర్యలు ఉన్నాయని ఈ వ్యవహారాన్ని పోలీసులు సీరియస్ గా పరిగణిస్తున్నారు.. ముఖ్యంగా ప్రమాదకర వాయిదాలను ప్రదర్శిస్తూ వేడుకలు నిర్వహించడం చట్టపరంగా నేరమని పోలీసులు చెబుతున్నారు.
యువతపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని మన వైపు గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.. పెద్దపట్నం గ్రామస్తులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదును కూడా చేశారు.. యువకుల ప్రదర్శన వల్ల గ్రామంలో శాంతిభద్రతలు దెబ్బతింటున్నాయని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు పోలీసులు ముగ్గురు యువకులను స్టేషన్కు పిలిపించి విచారణ చేపట్టారు.. వీడియోలో కనిపించే దృశ్యాలు , గ్రామస్తుల వాగ్మూలాలను రికార్డ్ చేసి దాని ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసేందుకు చర్యలను చేపట్టారు.. ఈ ఘటన గ్రామంలో ఇప్పుడు చర్చిన అంశంగా మారింది యువత తమ వేడుకలను హద్దు దాటి జరుపుకుంటే సమాజంపై ఎలాంటి ప్రభావం ఉంటుందనే అంశంపై గ్రామస్థాయిలో చర్చ మొదలైంది.. పుట్టినరోజు వేడుకల పేరిట జరిగిన ఈ ఘటన యువతలో పెరుగుతున్న బాధ్యత వినతకు నిదర్శనమని పలువురు వాపోతున్నారు.. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులను విజ్ఞప్తి చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.




