సపోటాతో పుట్టెడు లాభాలు.. తింటే కలిగే ప్రయోజనాలు ఇవే!

Samatha

20 January 2026

పండ్లలో సపోటా పండు టేస్టే వేరుంటుంది. చూడటానికి గుండ్రంగా, చాలా తీపిగా ఉంటుంది. అందుకే చాలా మంది దీనిని ఎక్కువ ఇష్టంతో తింటుంటారు.

సపోటా

చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా దీనిని తింటారు. అంతే కాకుండా సపోటా పండు తినడం వలన కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.

ఇష్టంగా తినే పండు

ఇందులో విటమిన్స్, మినరల్స్, విటమిన్ సి, పుష్కలంగా ఉండటం వలన ఇది శరీరానికి అనేక విధాలుగా మేలు చేస్తుందని చెబుతున్నారు వైద్య నిపుణులు.

విటమిన్స్, మినరల్స్

కాగా ఇప్పుడు మనం సపోటా పండు తినడం వలన కలిగే ప్రయోజనాలు, దీని వలన కలిగే ఆరోగ్య లాభాల గురించి తెలుసుకుందాం.

ఆరోగ్య ప్రయోజనాలు

సపోటాల విటమిన్స్ , యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వలన ఇది దగ్గు, జలుబు వంటి సమస్యల నుంచి త్వరగా బయటపడేలా చేస్తుందంట.

దగ్గు,జలుబు

అదే విధంగా ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. పోషకాలు పుష్కలంగా ఉండటం వలన ఇది రోగనిరోధక శక్తి పెంచడంలో కీలకంగా వ్యవహరిస్తుంది.

విటమిన్ సి

జీర్ణ సమస్యలతో బాధపడే వారికి కూడా ఇది చాలా బెస్ట్ అని చెప్పాలి. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉండటం వలన ఇది మలబద్ధకం తగ్గించి, జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తుంది.

జీర్ణ సమస్యలు

నిద్రలేమి సమస్యతో బాధపడే వారు కూడా సపోటా తినడం మంచిదని చెబుతున్నారు నిపుణులు. ఇది ఒత్తిడిని తగ్గించి మంచి నిద్రను ప్రోత్సహిస్తుంది.

నిద్రలేమి

అలాగే క్యాన్సర్‌తో బాధపడే వారు కూడా సపోటా తినడం చాలా మంచిదంట. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ కణాలను నిరోధించి, ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

క్యాన్సర్ కణాల నిరోధన