Medaram Jatara 2026: దారులన్నీ మేడారం వైపే.. అలా చేస్తే ఇట్టే పసిగడతారు.. AI టెక్నాలజీతో ఖాకీల మూడో కన్ను
మేడారం మహాజాతర నిర్వహణలో పోలీస్ డిపార్ట్మెంట్ ఆధునిక హంగులతో సన్నద్దమవుతోంది. తొలిసారిగా ఎఐ టెక్నాలజీతో భద్రత కల్పించబోతున్నారు. AI టెక్నాలజీ కెమెరాలతో పాటు, 20 డ్రోన్స్ గగనతలం నుంచి డేగ కన్నుతో భద్రత పర్యవేక్షణ చేయబోతున్నారు. మేడారంలో ఏర్పాటుచేసిన పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచే చుట్టూ 20 కిలో మీటర్ల మేర ఎఐ టెక్నాలజీతో మూడో కన్ను నిఘా పెట్టారు. మేడారం జాతరలో పోలీస్ భద్రతపై స్పెషల్ రిపోర్ట్..

తెలంగాణ కుంభమేళ.. లక్షలాది మంది భక్తులను ఒక్కచోటికి చేర్చే సంబురం.. మేడారం మహాజాతర కు సర్వం సిద్ధమయ్యింది. జనవరి 28 నుండి 31 తేదీ వరకు ఈ సారి మహాజాతర నిర్వహించబోతున్నారు.. మేడారం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం భక్తుల భద్రతపై కూడా అదే స్థాయిలో దృష్టి పెట్టింది. గత జాతరలకు పూర్తి భిన్నంగా ఈ సారి మాహాజాతరకు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. జాతర నిర్వహనలో పోలీస్ శాఖది కీలమైన పాత్ర.. అమ్మవార్లను గద్దెలపైకి తీసుకురావడం నుంచి వన ప్రవేశం చేసే వరకూ.. క్రౌడ్ కంట్రోల్ మేనేజ్ మెంట్, ట్రాఫిక్ నియంత్రణ, VIP లు, VVIPల భద్రత పూర్తిగా పోలీస్ శాఖనే పర్యవేక్షిస్తుంది. ఈ సారి మహాజాతర కోసం 13 వేల మంది విధులు నిర్వహించబోతునున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని జాతర ఏర్పాట్లలో సాంకేతికతను కూడా వినియోగిస్తోంది.
ట్రాఫిక్ నియంత్రణ కోసం ఏఐ టెక్నాలజీని వినియోగిస్తోంది. ప్రత్యేక సాఫ్ట్ వేర్ తో కూడిన కెమెరాలను ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారు. వీటిని కమాండ్ కంట్రోల్ రూంకు అనుసంధానిస్తున్నారు. వీటి ద్వారా చుట్టూ 20 చదరపు కిలోమీటర్ల నిడివితో పర్యవేక్షణ ఉంటుంది. నలుగురికంటే ఎక్కువ మంది గుమిగూడిన ప్రాంతాలను గుర్తించి, రద్దీ నియంత్రణ చర్యలు తీసుకుంటారు. భక్తుల సంఖ్యను కొలిచే క్రౌడ్ కౌటింగ్ కెమెరాలు, వాహనాల సంఖ్యను అంచనా వేసేందుకు నెంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు.
20 డ్రోన్ కెమెరాలు, 480 సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూంకు అనుసంధానం చేసి నిరంతర నిఘా ఏర్పాటు చేశారు. నిఘాను మరింత పటిష్ఠం చేసేందుకు డ్రోన్ కెమెరాలను కూడా వినియోగిస్తున్నారు.
వీటికి తోడు మిస్సయిన వారిని గుర్తించడం కోసం జియో ట్యాగ్ ఏర్పాటు చేశారు. కుటుంబ సమేతంగా వచ్చే భక్తులు పిల్లలతో పాటు పెద్దవాళ్లు తప్పిపోతుంటారు. అలాంటి వారికి సేఫ్ గా వారి కుటుంబ సభ్యుల దగ్గరకు చేర్చేందుకు ప్రత్యేక కార్యచరణ చేపట్టారు. పిల్లల చేతికి జీపీఎస్ బ్యాండ్ వేయడం ద్వారా వారు ఎక్కడ ఉన్నా సులభంగా గుర్తించవచ్చు.. గత జాతరలో మొత్తం 30 వేలమంది పోగా వారిని పోలీసులు వారి కుటుంబసభ్యుల వద్దకు చేర్చారు. ఈసారి జియో ట్యాగ్ ద్వారా మిస్సింగ్ పర్సన్స్ ను ట్రాకింగ్ చేయబోతున్నారు. ఇక వాహనాల పార్కింగ్ కోసం 1400 ఎకరాల్లో 33 పార్కింగ్ స్థలాలను అందుబాటులోకి తెస్తున్నారు.
మేడారం జాతర నిర్వహణలో ఆధునిక టెక్నాలజీని ఉపయోగిస్తున్న పోలీసులు పూర్తి స్థాయిలో సిద్ధమయ్యారు. ఖాకీల మూడో కన్నుపై నిఘాతో ఈ సారి మహాజాతర మరింత పకడ్బందీగా జరుగనుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
