Bigg Boss 6 : సినిమాను మించిన ట్విస్ట్.. ఈ వారం బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది ఆ కంటెస్టెంటేనా..?

ఇక వారాంతం వచ్చిందంటే కింగ్ నాగార్జున హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి హౌస్ మేట్స్ తో ఆడిపాడి అలరిస్తున్నారు. అలాగే చివరిలో ఎలిమినేషన్ తో టెన్షన్ లో పడేస్తున్నారు. ఇప్పటికే బిగ్ బాస్ లో ఊహించని ఎలిమినేషన్స్ జరుగుతున్న విషయం  తెలిసిందే.

Bigg Boss 6 : సినిమాను మించిన ట్విస్ట్.. ఈ వారం బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది ఆ కంటెస్టెంటేనా..?
Bigg Boss
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 27, 2022 | 7:40 AM

బిగ్ బాస్ సీజన్ 6 రసావత్రంగా మారింది.. టాప్ 5లో ఎవరు ఉంటారు. ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక వారాంతం వచ్చిందంటే కింగ్ నాగార్జున హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి హౌస్ మేట్స్ తో ఆడిపాడి అలరిస్తున్నారు. అలాగే చివరిలో ఎలిమినేషన్ తో టెన్షన్ లో పడేస్తున్నారు. ఇప్పటికే బిగ్ బాస్ లో ఊహించని ఎలిమినేషన్స్ జరుగుతున్న విషయం  తెలిసిందే. చివరివరకు ఉంటారు అనుకున్న కంటెస్టెంట్స్ అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశారు. ముఖ్యంగా సూర్య, గీతూ, బాలాదిత్య. ఇక ఈ వారం హౌస్ నుంచి ఎవరు బయటకు వచ్చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఏడుగురు ఈవారం నామినేషన్స్‌లో ఉన్నారు. రోహిత్, ఆదిరెడ్డి, శ్రీహాన్, రాజ్, ఇనయ, ఫైమా, శ్రీసత్యలు నామినేషన్స్‌లో ఉండగా.. ఇనయ, శ్రీహాన్‌, రోహిత్‌ లు సేఫ్ జోన్ లో ఉన్నారు. ముఖ్యంగా రోహిత్‌కి మంచి ఓట్లు పడుతున్నాయి. ఆదిరెడ్డికి కూడా ఈ వారంలో మంచి ఓటింగ్ జరిగిందని తెలుస్తోంది.

ఫైమా, రాజ్, శ్రీసత్య.. ఈ ముగ్గురిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ ముగ్గురిలో ఎవరికి ఓటింగ్ తక్కువ ఉంటే వారు ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేస్తారు. కాగా రాజ్ కు ఈవారం ఓట్లు తక్కువచ్చాయని తెలుస్తోంది. ఈ ఓటింగ్ లో శ్రీ సత్య, రాజ్ లు పోటీ పడ్డారు.

ఇవి కూడా చదవండి

పోటాపోటీగా జరిగిన ఈ ఓటింగ్ లో శ్రీ సత్యకు ఎక్కువ ఓట్లు రావడంతో రాజ్ ఎలిమినేట్ అయ్యినట్టు తెలుస్తోంది. ఫైమా డేంజర్ జోన్‌లో ఉన్నా.. ఆమె దగ్గర ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉంది కాబట్టి.. దాన్ని ఉపయోగించుకుని ఎలిమినేషన్ నుంచి సేవ్ అవుతుంది. ఒక వేళ ముందుగానే ఫైమా సేఫ్ అయితే మాత్రం తనదగ్గరున్న ఎవిక్షన్ ఫ్రీ పాస్ ను రాజ్ కోసం ఉపయోగిస్తే అతను సేఫ్ అవుతాడు. మరి చూడాలి ఏం జరుగుతుందో..