Bigg Boss 6: టికెట్ టు ఫినాలే రేసులో ఆదిరెడ్డికి ఎదురుదెబ్బ.. ఏంటి బిగ్ బాస్ ఇలా చేశావ్
అయితే ఏకాభిప్రాయంతో హౌస్ లో కొంతమందిని అందకుండా చేశాడు బిగ్ బాస్. దాంతో ప్రేక్షకులకు కూడా ఇదెక్కడి ఫైటింగ్ రాబాబు అనిపించింది.
టికెట్ టు ఫినాలే రేసు మంచి రసవత్తరంగా సాగింది. బిగ్ బాస్ హౌస్ లో మిగిలిన కంటెస్టెంట్స్ లో టికెట్ టు ఫినాలే గెలుచుకునేందుకు ఇచ్చిన టాస్క్ లలో ఒకొక్కరు చాలా కష్టపడ్డారు. వీరందరిలో ఎక్కువగా పాయింట్లు గెలుచుకుంటూ దూసుకుపోయాడు కామన్ మెన్ ఆది రెడ్డి. కానీ ఊహించని విధంగా లాస్ట్ టాస్క్ లో ఆది రెడ్డి ఓడిపోయాడు. అయితే ఏకాభిప్రాయంతో హౌస్ లో కొంతమందిని అందకుండా చేశాడు బిగ్ బాస్. దాంతో ప్రేక్షకులకు కూడా ఇదెక్కడి ఫైటింగ్ రాబాబు అనిపించింది. ఇక చివరి టాస్క్ లో రేవంత్, ఆదిరెడ్డి, శ్రీహాన్‌లు ముగ్గురూ పోటీపడ్డారు. దాని కంటే ముందు వరకూ ఆదిరెడ్డి.. అందరి కంటే ఎక్కువ పాయింట్లతో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. ఈ టాస్క్ తరువాత మూడో స్థానానికి పడిపోయాడు. ఈ టాస్క్ లో ఆది రెడ్డికి దెబ్బ పడింది.
బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో పరిగెత్తుతూ బెలూన్ ఊది. ఆ తర్వాత పగలగొట్టాలని చెప్పాడు. దాంతో ఈ టాస్క్ లో రేవంత్ అందరికంటే ముందుగా ఈ టాస్క్ ను కంప్లీట్ చేసి విన్ అయ్యాడు. ఆ తర్వాత శ్రీహాన్ గెలిచాడు. ఫైనల్ గా ఆది రెడ్డి ఈ టాస్క్ లో వెనక పడ్డాడు. అయినప్పటికీ శ్రీహాన్, ఆదిరెడ్డిలు 14 పాయింట్‌లతో రెండో స్థానానికి టై అయ్యింది. దాంతో బిగ్ బాస్ ఈ ఇద్దరికి మరో టాస్క్ ఇచ్చాడు. మళ్లీ ఈ బెలూన్‌లు ఊదే గేమ్ ఆడాలని టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్.
దాంతో ఈ టాస్క్ లో కూడా ఆదిరెడ్డి ఓడిపోయాడు. టై అయినప్పుడు.. వేరే టాస్క్ ఇవ్వాలి కదా బిగ్ బాస్.. నేను ఓడిపోయిన టాస్క్‌నే మీరు ఎలా ఇస్తారు అని ప్రశ్నించాడు. ఆ తర్వాత రోహిత్-ఇనయల మధ్య వాదన జరిగింది. ఇక హౌస్ మేట్స్ తీసుకుంటున్న ఏకాభిప్రాయం ప్రాసెస్ లో రోహిత్ ఫైర్ అయ్యాడు. ఇది అన్ ఫెయిర్.. నాకు మీరు అవకాశం ఇవ్వడం కాదు.. టాప్‌లో ఉన్న వాళ్లని నెక్స్ట్ లెవల్‌కి పంపాలి కానీ లీస్ట్‌లో ఉన్న వాళ్లని కాదు.. నేను దీన్ని యాక్సెప్ట్ చేయను అని గేమ్ నుంచి తనకి తాను తప్పుకున్నాడు. ఈ ప్రాసెస్‌లో ఇనయ, రోహిత్‌ల మధ్య పెద్ద గొడవే అయ్యింది.