Ashu Reddy: మరోసారి వేణుస్వామితో కలిసి అషూ రెడ్డి ప్రత్యేక పూజలు.. ఈసారి ఆ ప్రముఖ దేవాలయంలో.. అందుకోసమేనా?
టాలీవుడ్ ప్రముఖ నటి, బుల్లితెర యాంకర్ అషూ రెడ్డి గతంలో పలు సార్లు వేణు స్వామితో కలిసి పూజలు చేసింది. ఇప్పుడు మరోసారి ఆయనతో కలిసి ఓ ప్రముఖ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

జూనియర్ సమంతగా అషూ రెడ్డికి టాలీవుడ్ లో మంచి గుర్తింపు ఉంది. టిక్ టాక్ వీడియోలు, డబ్ స్మాష్ వీడియోలతో వీడియోలతో బాగా ఫేమస్ అయిన ఈ ముద్దుగుమ్మ మొదట బుల్లితెరపై అడుగు పెట్టింది. బిగ్ బాస్ రియాలిటీ షోతో సహా పలు టీవీ షోస్, ప్రోగ్రామ్స్ లోనూ సందడి చేసింది. కొన్ని సినిమాల్లోనూ హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి మెప్పించింది. ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూనే యాంకర్ గా టీవీ షోస్, ప్రోగ్రామ్స్ తో బిజీగా ఉంటోంది. అలాగే యూట్యూబ్ లో సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేస్తోంది. సినిమాలు, టీవీ షోస్ సంగతి పక్కన పెడితే అషూ రెడ్డికి దైవ చింతన కాస్త ఎక్కువే. గతంలో పలు ప్రముఖ దేవాలయాలను సందర్శించుకుందీ అందాల తార. తాజాగా అస్సాంలోని ప్రముఖ కామాఖ్య ఆలయాన్ని దర్శించకుందీ ముద్దుగుమ్మ. అక్కడ ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామితో కలిసి ప్రత్యేక పూజలు చేసింది. అనంతరం ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి. వీటిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
కాగా గతంలో పలు సార్లు వేణు స్వామితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించింది అషూ రెడ్డి. ఈసారి అది కూడా ప్రముఖ కామాఖ్య ఆలయంలో పూజలు చేయించుకోవడం చర్చనీయాంశంగా మారింది. సెలబ్రిటీలకు జాతకాలు చెబుతోన్న వేణు స్వామి వారికి ఏమైనా దోషాలు ఉన్నట్లయితే పరిహారంగా ఇలాంటి పూజలు నిర్వహించడం లాంటివి చేస్తూ ఉంటాడు. ఇప్పుడు అషూ రెడ్డితో కలిసి అలాంటి పూజలే చేయించాడా?అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.
కామాఖ్య ఆలయంలో వేణు స్వామి, అషూ రెడ్డి.. వీడియో..
View this post on Instagram
కాగా ఈ మధ్య కాలంలో మిల్కీ బ్యూటీ తమన్నా, ఐశ్వర్యా రాజేష్ తదితర హీరోయిన్లు అస్సాంలోని కామాఖ్య ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన సంగతి తెలిసిందే.








