- Telugu News Photo Gallery Cinema photos Actress Nidhhi Agerwal Shares Stunning Beautiful Photos Goes Viral
Nidhhi Agerwal : అందాల నిధి.. ఆశలన్నీ ఆ సినిమా పైనే.. ముద్దుగుమ్మకు కలిసోస్తుందా.. ?
చాలా కాలం తర్వాత అడియన్స్ ముందుకు రానుంది హీరోయిన్ నిధి అగర్వాల్. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఆశలన్నీ ఆ సినిమా పైనే ఉన్నాయి. తాజాగా సోషల్ మీడియాలో ఈ వయ్యారి షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. తెలుగు సినీప్రియులకు నిధి అగర్వాల్ ప్రత్యేకంగా పరిచయం అవసరంలేదు.
Updated on: Jun 02, 2025 | 11:14 AM

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నిధి అగర్వాల్.. ప్రస్తుతం సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తుంది. ఇప్పటివరకు ఈ అమ్మడు నటించిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ అయిన సంగతి తెలిసిందే.

దీంతో ఈ బ్యూటీకి తెలుగులో అంతగా ఆఫర్స్ రాలేదు. కానీ తమిళంలో మాత్రం వరుస అవకాశాలు అందుకుంది. ఇప్పుడు తెలుగులో ఈ అమ్మడు నటిస్తోన్న లేటేస్ట్ మూవీ హరి హర వీరమల్లు. త్వరలోనే ఈ మూవీ అడియన్స్ ముందుకు రానుంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాపైనే నిధి ఆశలు పెట్టుకుంది. ఇప్పటివరకు వరుస డిజాస్టర్స్ అందుకున్న నిధి.. ఇప్పుడు భారీ హిట్టు కోసం వెయిట్ చేస్తుంది. ఇప్పటికే హరి హర వీరమల్లు సినిమాపై భారీ హైప్ నెలకొంది.

మరోవైపు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది నిధి. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. అలాగే ఇటీవల తన ప్రేమ, పెళ్లి గురించి వస్తున్న రూమర్స్ పై గట్టిగానే రియాక్ట్ అయ్యింది.

సినిమాల్లో నటించే హీరోయిన్స్ గురించి చాలా రూమర్స్ వస్తాయని.. ముఖ్యంగా పర్సనల్ లైఫ్ మీదనే ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారని.. ఏది అనిపిస్తే దాన్ని బయటకు అనేస్తారని.. ఇదంచా చాలా కామన్ అని అన్నారు.




