- Telugu News Photo Gallery Cinema photos Do You Know Trisha Remuneration For Kamal Haasan Thug Life Movie
Trisha : తస్సాదియ్యా.. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ తగ్గేదేలే.. కమల్ హాసన్ సినిమాకు త్రిష దిమ్మతిరిగే రెమ్యునరేషన్..
దాదాపు రెండు దశాబ్దాలుగా సినీరంగంలో సత్తా చాటుతున్న హీరోయిన్ త్రిష. 42 ఏళ్ల వయసులోనూ చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది. ఈ ఏడాది బ్యాక్ టూ బ్యాక్ హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన ఈ అమ్మడు.. ఇప్పుడు థగ్ లైఫ్ సినిమాతో అడియన్స్ ముందుకు రాబోతుంది. ప్రస్తుతం త్రిష రెమ్యునరేషన్ నెట్టింట హాట్ టాపిక్ అవుతుంది.
Updated on: Jun 02, 2025 | 7:57 AM

సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక డిమాండ్ ఉన్న హీరోయిన్లలో త్రిష ఒకరు. దాదాపు రెండు దశాబ్దాలుగా సినీరంగాన్ని ఏలేస్తోన్న ఈ అమ్మడు.. ఇప్పుడు చేతినిండా సినిమాలతో కుర్ర హీరోయిన్లకే చుక్కలు చూపిస్తుంది. ఆమె చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది.

డైరెక్టర్ మణిరత్నం, కమల్ హాసన్ కాంబోలో వస్తున్న సినిమా థగ్ లైఫ్. దాదాపు 35 ఏళ్ల తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో శింబు, త్రిష, అశోక్ సెల్వన్, అభిరామి కీలకపాత్రలు పోషిస్తున్నారు.

ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మద్రాస్ టాకీస్, రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జూన్ 5న ఈ చిత్రం తమిళంతోపాటు తెలుగు, కన్నడ, మలయాళం భాషలలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.

కొన్ని రోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇక ఎప్పటిలాగే 42 ఏళ్ల వయసులోనూ 25 ఏళ్ల అమ్మాయిగా కనిపిస్తూ అందంతో మెస్మరైజ్ చేస్తుంది త్రిష. ప్రస్తుతం ఈ చిత్రం ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటుంది.

ఇదిలా ఉంటే థగ్ లైఫ్ సినిమా కోసం త్రిష తీసుకుంటున్న పారితోషికం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది. ఇందులో ఇంద్రాణి పాత్రలో నటిస్తున్న త్రిష.. అందుకు రూ.12 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. సెకండ్ ఇన్నింగ్స్ లోనూ భారీగా డిమాండ్ చేస్తుందట.




