Sreeleela: శ్రీలీల నిజంగానే పెళ్లి చేసుకోబోతున్నారా… అసలేం జరుగుతోంది
శ్రీలీల పెళ్లి చేసుకోబోతుందా..? ఎహే ఊరుకోండి.. పట్టుమతి పాతికేళ్లు కూడా లేవు.. పైగా కెరీర్‌లో కూడా టాప్ ఫామ్‌లో ఉంది.. ఇలాంటి సమయంలో పెళ్లేంటి అనుకుంటున్నారు కదా..? నిప్పు లేనిదే పొగ వస్తుందా చెప్పండి..? అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో వచ్చే వార్తలే ఈ నిప్పును రాజేస్తుంటాయి. మరి శ్రీలీల పెళ్లిపై ఇప్పుడెందుకు న్యూస్ వచ్చిందో చూద్దామా..?
Updated on: Jun 02, 2025 | 7:55 PM

ఉన్నట్లుండి శ్రీలీల పెళ్లి గురించి సోషల్ మీడియాలో వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. అదేంటి అనుకోవచ్చు.. కానీ ఆమె పసుపు పెట్టుకుంటున్న ఫోటోలు వైరల్ కావడంతో.. నిశ్చితార్థం జరిగిందంటూ వార్తలొచ్చాయి.

పైగా ఆ మధ్య బాలీవుడ్ హీరో కార్తిక్ ఆర్యన్‌తో శ్రీలీల ప్రేమలో పడిందనే వార్తలు కూడా రావడంతో.. ఈ రెండూ బాగా లింక్ అయ్యాయి. శ్రీలీలకు అప్పుడే పెళ్లేంటి.. అందులో నిజం లేదంటూ ఆమె ఫ్యాన్స్ ఈ న్యూస్ నమ్మలేదు.

ఇప్పుడు వాళ్ల నమ్మకమే నిజమైంది. అసలు విషయం ఏంటంటే.. ఆమె ఇంట్లో కొన్ని పూజలు జరిగాయి. అందులో భాగంగానే ఈ పసుపు పెట్టుకుంటున్న స్టిల్స్ బయటికొచ్చాయి.

దాంతో నిశ్చితార్థం అయింది.. పెళ్లికి రెడీ అంటూ వార్తలు వచ్చేసాయి. కెరీర్‌లో చాలా బిజీగా ఉన్నారు శ్రీలీల. తెలుగులో ఉస్తాద్ భగత్ సింగ్, మాస్ జాతర, లెనిన్ సినిమాలు చేస్తున్న ఈమె.. తమిళంలో పరాశక్తిలో నటిస్తున్నారు.

అలాగే హిందీలో కార్తిక్ ఆర్యన్ సినిమాతో ఎంట్రీ ఇస్తున్నారు. మరో సినిమా కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. ఇలాంటి సమయంలో పెళ్లి అనే కాన్సెప్టే తన లైఫ్‌లో లేదంటున్నారు ఈ బ్యూటీ.




