Bigg Boss 6 : “ఆ నాలుగేళ్లు నరకం చూడాల్సి వచ్చింది”.. ఆసక్తికర విషయం తెలిపిన సుధీప

బిగ్ బాస్ సీజన్ 6 కి ప్రస్తుతం ఫుల్ జోష్ లో రన్  అవుతున్న  విషయం తెలిసిందే. 20 మంది కంటెస్టెంట్స్ తో సీజన్ 6 ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

Bigg Boss 6 : ఆ నాలుగేళ్లు నరకం చూడాల్సి వచ్చింది.. ఆసక్తికర విషయం తెలిపిన సుధీప
Sudheepa
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 10, 2022 | 10:11 AM

బిగ్ బాస్ సీజన్ 6(Bigg Boss 6 ) ప్రస్తుతం ఫుల్ జోష్ లో రన్  అవుతున్న  విషయం తెలిసిందే. 20 మంది కంటెస్టెంట్స్ తో సీజన్ 6 ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక హౌస్ లో అడుగు పెట్టిన వాళ్లలో చాలా మంది  ఎక్కువ మందికి తెలియని మొఖాలే. అయితే అంతో ఇంతో తెలిసిన వాళ్లలో పింకీ ఒకరు. పింకీ అంటే గుర్తుపట్టడం పెద్ద కష్టమేమి కాదు. వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో ఆర్తి అగర్వాల్ సిస్టర్ గా నటించి మెప్పించింది ఈ చిన్నది. పింకీ అసలు పేరు సుధీప. ఇప్పుడు ఈ చిన్నది బిగ్ బాస్ హౌస్ లో సందడి చేస్తోంది. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళకముందు ఆమె ఓ ఇంట్రవ్యూలో మాట్లాడింది. ఈ ఇంట్రవ్యూలో అశ్శక్తికర విషాలను పంచుకుంది సుధీప. అలాగే తన లవ్ స్టోరీ గురించి కూడా పంచుకుంది.

సుధీప శ్రీరంగనాథ్‌ అనే సాఫ్ట్‌ వేర్‌ ని ప్రేమించి పెళ్లాడింది. అయితే వీరి వివాహం అంత ఈజీగా జరగలేదట. మొదట్లో తమ ప్రేమ గురించి ఇంట్లో చెప్తే వివాహానికి ఒప్పుకోలేదట. దాదాపు నాలుగేళ్లు పట్టిందట తన ఇంట్లో వాళ్ళు వీరి ప్రేమను అంగీకరించి పెళ్లి చేయడానికి. అయితే ఆసమయంలో నరకం చూశానని చెప్పుకొచ్చింది. ప్రేమ విషయం తెలిసిన దగ్గర నుంచి పెళ్లి సంబంధాలు తీసుకువచ్చే వారని తనకు ఇష్టం లేదని చెప్పేదాన్ని అని ఇంట్లో వాళ్ళు తిట్టేవారని తెలిపింది. ఇలా నాలుగేళ్ళు నరకం చూశాను అంటోంది ఈ చిన్నది. రెండేసి రోజులు, మూడేసి రోజులు సరిగ్గా తినకుండా ఉండడంకూడా చేసిందట చివరకు ఆమె ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం సీరియల్స్ చేస్తోంది సుధీప. మరి ఈ అమందు బిగ్ బాస్ లో ఎన్నో వారలు ఉంటుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

ఇవి కూడా చదవండి