Charmy Kaur: ఒక్క ట్వీట్‌తో నోరుమూయించిందిగా..? దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన ఛార్మి
ఒకప్పుడు హీరోయిన్ గా రాణించిన ఛార్మి ఆ తర్వాత నిర్మాతగా మారిపోయిన విషయం తెలిసిందే. దాదాపు స్టార్ హీరోల సరసన సినిమాలు చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు ప్రొడ్యూసర్ గా రాణిస్తుంది.
Charmy Kau: ఒకప్పుడు హీరోయిన్ గా రాణించిన ఛార్మి ఆ తర్వాత నిర్మాతగా మారిపోయిన విషయం తెలిసిందే. దాదాపు స్టార్ హీరోల సరసన సినిమాలు చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు ప్రొడ్యూసర్ గా రాణిస్తుంది. డైనమిక్ డైరెక్టర్ పూరీజగన్నాథ్ తో కలిసి పూరీ కనెక్ట్స్ బ్యానర్ పై ఛార్మి సినిమాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల వీరి కాంబోలో లైగర్ మూవీ వచ్చిన విషయం తెలిసిందే. లైగర్ మూవీ రిలీజ్ మరుసటి రోజు నుంచి సైలెంట్ అయిపోయిన ఛార్మీ.. సోషల్ మీడియాను మాత్రం వీడలేకపోతున్నారు. వీడిపోతున్నాను అంటూ.. చెబుతూనే తన పై… పూరీ పై.. తమ ప్రొడక్షన్ హౌస్ పూరీ కనెక్ట్స్ పై వస్తున్న రూమర్లకు త్రూ.. తన సోషల్ మీడియా హ్యాండిలింగ్స్ కౌంటర్ ఇస్తున్నారు. ఇదిలా ఉంటే తనకు పూరిజగన్నాథ్ కు మధ్య గొడవలు జరిగాయని. ఇద్దరి మధ్య మాటలు లేవని ఏవేవో రూమర్స్ పుట్టుకొచ్చాయి. తాజాగా ఈ రూమర్స్ పై స్పందించారు ఛార్మి.
తనకు పూరీకి మధ్య తీవ్ర గొడవలు జరిగాయంటూ వచ్చిన వార్తలపై క్లారిటీ ఇచ్చారు ఛార్మి. తమపై వస్తున్న వార్తలను రూమర్స్ రూమర్స్ రూమర్స్ అంటూ తాజాగా ట్వీట్ చేసారు ఛార్మి. త్వరలోనే పూరీ కనెక్ట్స్ మళ్లీ స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇస్తుందని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం దీనిపైనే ఫోకస్ చేసామని ట్వీట్ లో రాసుకొచ్చారు. తాము అధికారికంగా చెప్పేవరకు ఏదైనా రూమరే అంటూ మరో సారి చెప్పుకొచ్చారు. మొత్తానికి తమ స్నేహం పదిలంగానే ఉందని ఒక్క ట్వీట్‌తో చెప్పకనే చెప్పారు ఛార్మి.
Rumours rumours rumours! All rumours are fake! Just focusing on the progress of ?? .. Meanwhile, RIP rumours !!
— Charmme Kaur (@Charmmeofficial) September 8, 2022
మరిన్నిఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..