Nayanthara: మెగాస్టార్ సినిమాకోసం లేడీ సూపర్ స్టార్ రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటుందో తెలుసా..
లేడీ సూపర్ స్టార్ నయన తార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది నయన తార.
లేడీ సూపర్ స్టార్ నయన తార(Nayanthara)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది నయన తార. తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. దాదాపు అందరు స్టార్ హీరోల సరసన సినిమాలు చేసింది నయన్.. అంతే కాదు హీరోలతో సరి సమానంగా రెమ్యునరేషన్ అందుకుంటూ హాట్ టాపిక్ గా మారింది ఈ చిన్నది. ఇటీవలే దర్శకుడు విగ్నేష్ శివన్ ను వివాహం చేసుకొని కొత్త జీవితం ప్రారంభించింది నయన్. పెళ్లి తర్వాత ఈ బ్యూటీ ఆచి తూచి సినిమాలను ఎంచుకుంటోంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమాలో నటించింది నయన్. అలాగే బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటిస్తున్న జవాన్ సినిమాలో నయన్ హీరోయిన్ గా చేస్తోంది. ఈ సినిమాకు అట్లీ దర్శకత్వం వహిస్తున్నాడు.
ఇక మెగాస్టార్ సినిమా విషయానికొస్తే మలయాళ సూపర్ హిట్ మూవీ లూసీఫర్ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో చిరు డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు. అలాగే ఈ సినిమాలో నయనతార మెగాస్టార్ చెల్లెలుగా నటిస్తోంది. ఈ సినిమా కోసం నయనతార భారీగా రెమ్యునరేషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. గాడ్ ఫాదర్ కోసం నయన్ ఏకంగా మూడు కోట్లు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో నయన్, చిరు మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకుల చేత కంటతడి పెట్టిస్తాయని అంటున్నారు. ఈ సినిమా అక్టోబర్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరిన్నిఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..