AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 9 Telugu: అంతా సిద్ధం.. బిగ్‏బాస్‏లోకి కాంట్రవర్సీ క్వీన్స్.. ఈసారి వేరేలెవల్..

బుల్లితెరపై ఎన్ని వివాదాలు, విమర్శలు వచ్చినప్పటికీ బిగ్ బాస్ క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ భాషలలోనూ ఈ షోకు విపరీతమైన ఆదరణ లభిస్తుంది. ఇప్పటివరకు తెలుగులో 8 సీజన్స్ విజయవంతమయ్యాయి. ఇక త్వరలోనే సీజన్ 9 సైతం స్టార్ట్ కాబోతుంది. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా సీజన్ 9 కంటెస్టెంట్స్ పేర్లు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

Bigg Boss 9 Telugu: అంతా సిద్ధం.. బిగ్‏బాస్‏లోకి కాంట్రవర్సీ క్వీన్స్.. ఈసారి వేరేలెవల్..
Bigg Boss 9 Telugu
Rajitha Chanti
|

Updated on: Jun 22, 2025 | 10:49 AM

Share

బిగ్ బాస్ రియాల్టీ షో.. బుల్లితెరపై విపరీతమైన క్రేజ్ ఉన్న షో. ఇప్పటివరకు తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషలలో విజయవంతంగా కొసాగింది. తెలుగులో 8 సీజన్స్ కంప్లీట్ చేసుకున్న ఈ షో త్వరలోనే సీజన్ 9 స్టార్ట్ కానుంది. దీంతో ఇప్పుడు ఈ షో ప్రారంభానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కొన్నిరోజులుగా కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియ జరుగుతుందని.. ఇందులో భాగంగానే పలువురు సోషల్ మీడియాలో స్టార్స్ ను సంప్రదించినట్లు సమాచారం. దీంతో ఈసారి హౌస్ లోకి ఎవరెవరు ఎంట్రీ ఇవ్వబోతున్నారనే ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే ఈసారి పలువురు సోషల్ మీడియాలో కాంట్రవర్సీ క్వీన్స్ ను రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా కొందరి పేర్లు తెరపైకి వచ్చాయి. అందులో నెట్టింట పాపులర్ అయినవారితోపాటు బుల్లితెరపై పలు సీరియల్స్ ద్వారా జనాలకు దగ్గరైన తారలు సైతం ఉన్నారు. ఇంతకీ ఈసారి బిగ్ బాస్ లోకి రానున్న కంటెస్టెంట్స్ ఎవరెవరో తెలుసుకుందామా.

లేటేస్ట్ అప్డేట్ ప్రకారం బిగ్ బాస్ సీజన్ 9లోకి సీరియల్ నటి తేజస్విని, బిగ్ బాస్ 8వ సీజన్ విన్నర్ నిఖిల్ మాజీ ప్రేయసి సీరియల్ నటి కావ్యలను ఈసారి హౌస్ లోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచరాం. అలాగే మరో క్రేజీ ఆర్టిస్ట్ పేరు నవ్యసామి పేరు తెరపైకి వచ్చింది. వీరే కాకుండా ఛత్రపతి శేఖర్. బుల్లితెర యాక్టర్ ముఖేష్ గౌడ, గుప్పెడంత మనసు ఫేమ్ జ్యోతిరాయ్, సీనియర్ నటుడు సాయి కిరణ్, యూట్యూబర్ శ్రావణి వర్మ, ఆర్జే రాజ్ పేర్లు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే సోషల్ మీడియాలో షార్ట్ ఫిల్మ్స్ ద్వారా పాపులర్ అయిన బమ్ చిక్ బబ్లూను బిగ్ బాస్ మేకర్స్ సంప్రదించినట్లు సమాచారం. అలాగే జబర్థస్త్ కామెడియన్ ఇమ్మాన్యుయేల్, సీరియల్ నటి డెబ్జానీ పేర్లు సైతం వినిపిస్తున్నాయి. ప్రస్తుతం స్టార్ మాలో ప్రసారమవుతున్న కిర్రాక్ బాయ్స్, ఖిలాడీ గర్ల్స్ షోలో పాల్గొంటున్న కొందరు ఆర్టిస్టులు సైతం ఎంట్రీ ఇవ్వనున్నారట. సెప్టెంబర్ 7 నుంచి బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ కానున్నట్లు టాక్.

ఇవి కూడా చదవండి :  

వయసు 41.. ఒక్కో సినిమాకు రూ.5 కోట్లు.. క్రేజ్ చూస్తే దిమాక్ కరాబ్..

సీరియల్లో పద్దతిగా.. వెకేషన్‏లో గ్లామర్‏గా.. రుద్రాణి అత్త అరాచకమే..

త్రిష అందానికి రహస్యం ఇదేనట.. ఆ విషయంలో కండీషన్ పెట్టుకుందట..

Color Photo Movie: కలర్ ఫోటో సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ బాధపడుతుందట..

Follow Us
అప్పట్లో వేప చెట్టు కింద కూర్చొని ఈ వడలనే తినేవాళ్లు.. భలే చలువ
అప్పట్లో వేప చెట్టు కింద కూర్చొని ఈ వడలనే తినేవాళ్లు.. భలే చలువ
ఖలేజా సినిమా చేస్తున్నప్పుడు మహేష్ నాతో చెప్పిన మాట అదే..
ఖలేజా సినిమా చేస్తున్నప్పుడు మహేష్ నాతో చెప్పిన మాట అదే..
మహిళలకు ఇది కదా కావాల్సింది..ఒక్క రోజులోనే భారీగా పడిపోయిన బంగారం
మహిళలకు ఇది కదా కావాల్సింది..ఒక్క రోజులోనే భారీగా పడిపోయిన బంగారం
వామ్మో.. పాము పగ అంటే ఇట్లుంటదా.. వ్యక్తిని వెతికిమరీ 3 సార్లు..
వామ్మో.. పాము పగ అంటే ఇట్లుంటదా.. వ్యక్తిని వెతికిమరీ 3 సార్లు..
ఇంగ్లాండ్ సిరీస్ కోసం తుది జట్టులో మార్పులు ఇవే
ఇంగ్లాండ్ సిరీస్ కోసం తుది జట్టులో మార్పులు ఇవే
మీరు కొనే మటన్ ముదురా.. లేతదా? ఇలా ఒక్క ముక్కతోనే గుర్తించండి
మీరు కొనే మటన్ ముదురా.. లేతదా? ఇలా ఒక్క ముక్కతోనే గుర్తించండి
ఐపీఎల్‌లో తోపువే కావొచ్చు.. ఇక్కడ జీరోవే
ఐపీఎల్‌లో తోపువే కావొచ్చు.. ఇక్కడ జీరోవే
ఐర్లాండ్ చేతిలో పరాజయానికి 2 ప్రధాన కారణాలు చెప్పిన గవాస్కర్
ఐర్లాండ్ చేతిలో పరాజయానికి 2 ప్రధాన కారణాలు చెప్పిన గవాస్కర్
ఆరోగ్యం అనుకుని మీరు తింటున్న ఈ ఆహారాలే గుండెను ఏం చేస్తున్నాయో..
ఆరోగ్యం అనుకుని మీరు తింటున్న ఈ ఆహారాలే గుండెను ఏం చేస్తున్నాయో..
ఇక పెట్రోల్ బైకులు రోడ్లపై కనిపించవా..? సంచలన నిర్ణయం..!
ఇక పెట్రోల్ బైకులు రోడ్లపై కనిపించవా..? సంచలన నిర్ణయం..!