AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 8 Telugu Updates : ఈ సీజన్‌లో అవినాష్ బుక్ అయ్యాడు.. పాపం

హౌస్ లో రెండు గ్రూపులుగా మారింది. బిగ్ బాస్ కూడా ఈ రెండు గ్రూపులకు చిత్ర విచిత్రమైన టాస్క్ లు ఇస్తున్నాడు. కొత్త వారికి ఓజీ క్లాన్ అని వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన టీమ్ కు రాయల్ క్లాన్ అని విడదీశాడు బిగ్ బాస్.

Bigg Boss 8 Telugu Updates  : ఈ సీజన్‌లో అవినాష్ బుక్ అయ్యాడు.. పాపం
Mukku Avinash
Rajeev Rayala
|

Updated on: Oct 19, 2024 | 7:19 AM

Share

బిగ్ బాస్ సీజన్ 8 ఇప్పుడిప్పుడే ఊపందుకుంది. గత సీజన్ తో పోల్చితే ఈసారి అంతగా ప్రేక్షకులను ఆకట్టుకునే కంటెంట్ లేకపోవడంతో పాత కంటెస్టెంట్స్ ను రంగంలోకి దింపారు బిగ్ బాస్ టీమ్. దాంతో హౌస్ లో రెండు గ్రూపులుగా మారింది. బిగ్ బాస్ కూడా ఈ రెండు గ్రూపులకు చిత్ర విచిత్రమైన టాస్క్ లు ఇస్తున్నాడు. కొత్త వారికి ఓజీ క్లాన్ అని వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన టీమ్ కు రాయల్ క్లాన్ అని విడదీశాడు బిగ్ బాస్. ఇక వీరి మధ్య రకరకాల గేమ్స్, టాస్క్ లు ఇస్తున్నాడు. కాగా ఉదయం పూట ఎవరైనా నిద్రపోతే కుక్కలు అరిచే సౌండ్ వేస్తారు. అయితే నిన్న అవినాష్-మెహబూబ్ ఇద్దరూ నిద్రపోతుంటే ఆ ఇద్దరినీ గార్డెన్ ఏరియాకు పిలిచాడు. అక్కడ చిన్న కప్పుల్లో కాఫీ, వయొలిన్ ఉంచాడు. అది చూసి అందరూ షాక్ అయ్యారు. అవినాష్ మీరు ఇప్పటికే చాలా సార్లు కాఫీ, వయొలిన్ అడిగారు కదా అని బిగ్ బాస్ చెప్పగానే.. బిగ్‌బాస్ నేను అడిగింది.. ఒళ్లు నొప్పులు తగ్గడానికి కొట్టే పెయిన్ రిలీఫ్ వాలినీ స్ప్రే అంటూ చెబుతాడు.

ఇది కూడా చదవండి : ఎంత మోసం..! మసూద అని ముసుగేసారు కదరా..! ఇంత అందమైన అమ్మాయిని దెయ్యాన్ని చేశారు

ఆతర్వాత చిన్న కప్పులో ఉన్న కాఫీ తాగుతాడు అవినాష్ .. కాఫీ ఎలా ఉంది అని బిగ్ బాస్ అడిగితే వేడిగా ఉంది అని పంచ్ వేస్తాడు అవినాష్.. దానికి మెల్లగా తాగండి అని రివర్స్ పంచ్ వేశాడు బిగ్ బాస్. ఇక హౌస్ మేట్స్ అందరూ కూర్చొని ఉండగా పృథ్వీ ఆట పట్టిస్తాడు గౌతమ్. ఎప్పుడైనా గడ్డం తీసెస్తే సరదాగా నీ ఫొటో పంపియరా అని పృథ్వీతో అడుగుతాడు గౌతమ్. దానికి వద్దు ప్లీజ్ అంటూ విష్ణు ప్రియా రియాక్ట్ అవుతుంది. ఇక ట్రిమ్మర్‌తో తీసేద్దాం ఏదైతే అదే అయింది అని నిఖిల్ అంటాడు. దీంతో అయ్యో వద్దు బ్రో నేను చచ్చిపోతా.. అసలు నా ఫేస్ గడ్డం లేకుండా చూడలేను అని పృథ్వీ నవ్వకుంటూ చెప్తాడు.

ఇది కూడా చదవండి :అందచందాలు అదిరిపోయాయి.. కానీ వెనకాల కూడా చూసుకోవాలి కదమ్మా..!

ఇంతలో బిగ్ బాస్ టీవీలో పృథ్వీ గడ్డం లేకుండా ఉన్న మూడు ఏఐ ఫోటోలను చూపించి వాటి కింద ఒకొక్క అమౌంట్ ఇస్తాడు. హెయిర్ కట్ చేయించుకుంటే రూ. 25వేలు, గడ్డం మాత్రం తీసెస్తే రూ.50 వేలు, గడ్డం-మీసం రెండూ తీసెస్తే రూ. లక్ష అని రాసి ఉంటుంది. అలాగే అవినాష్ ఫోటోలు కూడా పెడతాడు. అయితే అవినాష్ గడ్డం-మీసం తీసేసి హెయిర్ స్పైక్ కటింగ్ చేయించుకొని రూ.50వేలు గెలుచుకుంటాడు.

ఇది కూడా చదవండి : Parvati Melton: పాపా.. పార్వతి ఇది నువ్వేనా..!! ఝలక్ ఇచ్చిన జల్సా బ్యూటీ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఎరుపు రంగు చీరలలో ముద్దుగుమ్మలు.. హీరోయిన్స్ స్పెషల్ అట్రాక్షన్..
ఎరుపు రంగు చీరలలో ముద్దుగుమ్మలు.. హీరోయిన్స్ స్పెషల్ అట్రాక్షన్..
మీరు మీ బంధువుల ఇంటిని అద్దెకు తీసుకుంటున్నారా? ఇక కొత్త నిబంధనలు
మీరు మీ బంధువుల ఇంటిని అద్దెకు తీసుకుంటున్నారా? ఇక కొత్త నిబంధనలు
నారా లోకేశ్‌పై ప్రశంసలు కురిపించిన.. హీరోయిన్ జాన్వీ కపూర్
నారా లోకేశ్‌పై ప్రశంసలు కురిపించిన.. హీరోయిన్ జాన్వీ కపూర్
దారుణం.. రెండు ముక్కలైన ఐఐటీ విద్యార్థి తల..!
దారుణం.. రెండు ముక్కలైన ఐఐటీ విద్యార్థి తల..!
టాస్‌కు 30 నిమిషాల ముందు ఎంట్రీ ఇచ్చి సెంచరీ బాదేశాడు
టాస్‌కు 30 నిమిషాల ముందు ఎంట్రీ ఇచ్చి సెంచరీ బాదేశాడు
మంచి రోజులు ప్రారంభమయ్యే ముందు.. మీ ఇంటిలో కనిపించే సంకేతాలు ఇవే!
మంచి రోజులు ప్రారంభమయ్యే ముందు.. మీ ఇంటిలో కనిపించే సంకేతాలు ఇవే!
పాల్వంచలో ఎగ్జామ్ రాస్తూ మృత శిశువుకు జన్మనిచ్చిన ఓ మైనర్ బాలిక
పాల్వంచలో ఎగ్జామ్ రాస్తూ మృత శిశువుకు జన్మనిచ్చిన ఓ మైనర్ బాలిక
పెప్పర్ చికెన్..! ఇలా చేసి తింటే.. మళ్లీ మళ్ళీ కావాలంటారు..!
పెప్పర్ చికెన్..! ఇలా చేసి తింటే.. మళ్లీ మళ్ళీ కావాలంటారు..!
ఓలా నుండి ఏథర్ వరకు 8 ఏళ్లు వారంటీ ఉన్న టాప్ 5 ఈ- స్కూటర్స్
ఓలా నుండి ఏథర్ వరకు 8 ఏళ్లు వారంటీ ఉన్న టాప్ 5 ఈ- స్కూటర్స్
నాలుగో తరం వారసత్వం దాదాపు ఖరారు..?
నాలుగో తరం వారసత్వం దాదాపు ఖరారు..?