Bigg Boss 8: రారా చూపిస్తా నా దమ్ము.. పృథ్వీ పై రెచ్చిపోయిన గౌతమ్
విష్ణు ప్రియా మెగా చీఫ్ అవ్వడంతో ఆమెకు ఓ స్పెషల్ పవర్ ఇచ్చాడు బిగ్ బాస్. దానికి ముందు ఓ అనౌన్స్ మెంట్ ఇచ్చాడు. ఇక పై ఆట మరింత కష్టంగా ఉండబోతుంది. అందుకు ఈ నామినేషన్స్ కూడా చాలా కీలకంగా ఉండబోతున్నాయి అని చెప్పాడు బిగ్ బాస్.
బిగ్ బాస్ హౌస్ లో సోమవారం నామినేషన్స్ హంగామా మొదలైంది. అంతకు ముందు అవినాష్ కడుపు నొప్పిగా ఉంది అని అండంతో డాక్టర్ ను పంపించారు బిగ్ బాస్. అతన్ని పరీక్షించిన తర్వాత చిన్న స్కాన్ చేయాలి అని చెప్పాడు డాక్టర్. అయితే అందుకోసం అతన్ని బయటకు తీసుకు వెళ్లాల్సి ఉంటుంది అని కూడా చెప్పాడు. అవినాష్ ఇక నేను వెళ్ళొస్తా అని చెప్పి షాక్ ఇచ్చాడు. ముందుగా ఎవ్వరూ నమ్మలేదు. ఆతర్వాత మా అమ్మ మీద ఒట్టు నేను వెళ్తున్నా.. కడుపులో ప్రాబ్లమ్ ఉంది.. అని చెప్పగానే రోహిణి, టేస్టీ తేజ ఏడ్చేశారు. ఆతర్వాత హరితేజ, నయని కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. నా వల్ల కావడంలేదు.. నేను చెప్పుకోవడం లేదు. నేను ఇక వెళ్తున్నా అని అవినాష్ కూడా ఎమోషనల్ అయ్యాడు. ఇంతలో గేట్లు ఓపెన్ అయ్యాయి. దాంతో గంగవ్వ కూడా కన్నీళ్లు పెట్టుకుంది. ఇక అందరికి బై బై చెప్పి వెళ్ళిపోయాడు.
ఆతర్వాత నామినేషన్స్ మొదలయ్యాయి. విష్ణు ప్రియా మెగా చీఫ్ అవ్వడంతో ఆమెకు ఓ స్పెషల్ పవర్ ఇచ్చాడు బిగ్ బాస్. దానికి ముందు ఓ అనౌన్స్ మెంట్ ఇచ్చాడు. ఇక పై ఆట మరింత కష్టంగా ఉండబోతుంది. అందుకు ఈ నామినేషన్స్ కూడా చాలా కీలకంగా ఉండబోతున్నాయి అని చెప్పాడు బిగ్ బాస్. అలాగే విష్ణు ప్రియను ఇంట్లో ఉండటానికి అర్హత లేని ఐదుగురిని ఎంపిక చేసి జైల్లో పెట్టి తాళం వేయమని చెప్పాడు బిగ్ బాస్. అలాగే వారు తమ వాదనను కూడా వినిపించవచ్చు అని అన్నాడు.
ముందుగా గౌతమ్ ను నామినేట్ చేసింది విష్ణు. దానికి రీజన్ చెప్తూ.. అశ్వత్థామ 2.0 అన్నందుకు గౌతమ్ హర్ట్ అవ్వడం కరెక్ట్‌గా అనిపించలేదు..అలాగే ఆడవాళ్లకు గౌరవం ఇవ్వాలి అని అంటావ్ కానీ వాళ్ళమీదే అరుస్తావ్ అంటూ విష్ణు చెప్పింది. దానికి గౌతమ్ రెచ్చిపోయాడు నేను ప్రేరణతో మాట్లాడుతుంటే యష్మీ మధ్యలో ఆద్యం పోసింది అని చెప్పాడు. దాంతో యష్మీ మాట్లాడుతూ నీ అభిప్రాయం నువ్వు చెప్తే న అభిప్రాయం నేను చెప్పా అని యష్మి అంది. దంతు నువ్వు ఆగు అక్క అంటూ ఆమెను మరింత రెచ్చ గొట్టాడు గౌతమ్. పదే పదే అక్క అంటూ ఆమెకు మరింత కోపం వచ్చేలా చేశాడు. నువ్వు అక్క అనుకు అని ఆమె చెప్పిన కూడా మనోడు ఆగలేదు. ఇక జైలు లోకి వెళ్లిన తర్వాత కూడావిష్ణు ప్రియతో వాదించాడు. నీ చుట్టూ ఇంతమంది ఉన్నారు. నా కంటే తక్కువ పని చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడావు అంటూ ఇండైరెక్ట్ గా పృథ్వీని లాగాడు. విష్ణు, గౌతమ్ వాదించుకుంటుంటే.. పృథ్వీ నవ్వాడు దానికి గౌతమ్ కు మరింత మండింది మస్త్ నవ్వొస్తుందిలే కాక నీకు.. అంటూ గౌతమ్ సీరియస్ అయ్యాడు. ఇంత వరకూ ఒక పర్సన్ అని చెప్పావ్.. నా పేరు చెప్పే దమ్ము కూడా నీకు లేదు..అంటూ గౌతమ్ ను రెచ్చగొట్టాడు. దానికి తాళం తీయ్.. దమ్ము లేదు గిమ్ము లేదు అంటే..రారా చూపిస్తా నా దమ్ము అంటూ గౌతమ్ అన్నాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.