52 ఏళ్ల వయసులో పెళ్ళికి రెడీ అయిన స్టార్ హీరోయిన్.. తనకన్నా చిన్నవాడితో
హీరోయిన్ గా టబు తెలుగుపై చెరగని ముద్ర వేసింది. చేసింది తక్కువ సినిమాలే అయినా, టబు అనగానే తెలుగు ప్రేక్షకులు 'మా హీరోయిన్ ' అంటుంటారు. ఆమె తమిళంలో నటించిన 'కాదల్ దేశమ్' తెలుగులో 'ప్రేమదేశం'గా విడుదలై ఘనవిజయం అందుకొంది.
ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలో పెళ్లి బాజాలు గట్టిగానే మోగుతున్నాయి. చాలా మంది తారలు పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని మొదలు పెట్టారు. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ చాలా మంది పెళ్లి పీటలెక్కారు. అయితే కొంతమంది హీరో హీరోయిన్స్ వయసు దాటి పోతున్న పెళ్లి జోలికి వెళ్లడం లేదు. పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిన వారు చాలా మంది ఉన్నారు. హీరోలు మాత్రమే కాదు హీరోయిన్స్ కూడా చాలా మంది పెళ్లి చేసుకోకుండా ఉండిపోయినవారు ఉన్నారు. అయితే ఇప్పుడు ఓ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పెళ్ళికి రెడీ అయ్యిందని తెలుస్తోంది. అందులో ఏముంది అని అనుకుంటున్నారా.? ఆమె వయసు 52 ఏళ్ళు.. వయసు పెరిగిన అందంలో మాత్రం ఆమె అప్సరసే.. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?
టాలీవుడ్ లో ఆమె చేసింది తక్కువ సినిమాలే అయినా స్టార్ డమ్ తెచ్చుకుంది. చేసిన సినిమాలన్నీ దాదాపు సూపర్ హిట్ గా నిలిచాయి. ప్రతి పాత్రలోనూ అద్భుతంగా నటించి మెప్పించింది ఆమె. కానీ ఇంతవరకు పెళ్లి చేసుకోకుండా ఉండిపోయింది. ఆమె మరెవరో కాదు అందాల భామ టబు. ఈ ముద్దుగుమ్మ అసలు పేరు తబుస్సుమ్ హష్మి. ఈ అమ్మడు హైదరాబాదీ ముస్లిం కుటుంబంలో జన్మించింది. వెంకటేష్ హీరోగా నటించిన ‘కూలీ నెంబర్ 1′ చిత్రంతో తెలుగులో కథానాయికగా పరిచయమైంది టబు.
కూలీ నెంబర్ 1’ తర్వాత చాలా రోజులకి ‘నిన్నే పెళ్లాడతా’లో నటించింది. ఆ సినిమాలో నాగార్జునతో టబు కెమిస్ట్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ‘చెన్నకేశవరెడ్డి’, ‘ఆవిడా మా ఆవిడే’, ‘అందరివాడు’, ‘పాండురంగడు’, ‘ఇదీ సంగతి’ ఇసినిమాలు చేసింది. చివరిగా అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో సినిమాలో నటించింది. కాగా బాలీవుడ్ లో ఇటీవలి క్రూ సినిమాలో మెరిసింది. ఈ వయసులోనూ ఆమె హాట్ గా నటించి మెప్పించింది. ఇదిలా ఉంటే ఇప్పుడు 52 ఏళ్ల వయసులో టబు పెళ్ళికి రెడీ అయ్యిందని టాక్ వినిపిస్తుంది. అది కూడా తనకన్నా వయసులో చిన్నవాడైన ఓ బాలీవుడ్ హీరోతో ఇప్పుడు ఇదే టాపిక్ బాలీవుడ్ లో తెగ వైరల్ అవుతుంది. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఇది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.