మా లైఫ్ ఓ సినిమా స్టోరీ.. అందుకే మేం విడిపోయాం.. షాకింగ్ విషయం చెప్పిన సుమంత్

అక్కినేని నాగేశ్వరరావు మనుమడు సుమంత్. అక్కినేని పెద్దకూతురు సత్యవతి, అల్లుడు యార్లగడ్డ సురేంద్ర దంపతుల కుమారుడు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ప్రేమ కథ సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు సుమంత్. 

మా లైఫ్ ఓ సినిమా స్టోరీ.. అందుకే మేం విడిపోయాం.. షాకింగ్ విషయం చెప్పిన సుమంత్
Sumanth
Follow us

|

Updated on: Oct 29, 2024 | 9:15 AM

అక్కినేని ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలు వచ్చి  విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇండస్ట్రీలో నాగార్జున, నాగ చైతన్య, అఖిల్, సుశాంత్ హీరోలుగా రాణిస్తున్నారు. నాగార్జున, నాగ చైతన్య వరుస సినిమాలతో దూసుకుపోతుంటే.. అఖిల్ ఏజెంట్ సినిమా తర్వాత గ్యాప్ తీసుకున్నాడు. అలాగే సుశాంత్ ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరో వైపు సెకండ్ హీరోగా కూడా చేస్తున్నాడు. అయితే వీరిలో మరో హీరో కూడా ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేసి ఆకట్టుకున్నారు. ఆయనే సుమంత్. అక్కినేని నాగేశ్వరరావు మనుమడు సుమంత్. అక్కినేని పెద్దకూతురు సత్యవతి, అల్లుడు యార్లగడ్డ సురేంద్ర దంపతుల కుమారుడు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ప్రేమ కథ సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు సుమంత్.

ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ అలరించారు. సుమంత్ సినిమాల్లో సత్యం, గోదావరి, గోల్కొండ హైస్కూల్, మళ్ళీ రావా ఇలా మంచి క్లాసిక్ సినిమాలు ఉన్నాయి. కాగా సుమంత్ పర్సనల్ లైఫ్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. సుమంత్ హీరోయిన్ కీర్తి రెడ్డిని వివాహం చేసుకున్నాడు. పవన్ కళ్యాణ్ నటించినతొలిప్రేమ, మహేష్ బాబు నటించిన అర్జున్ సినిమాల్లో నటించి మెప్పించింది కీర్తిరెడ్డి. అయితే సుమంత్, కీర్తిరెడ్డి ఎక్కవ కాలం కలిసి లేరు. ఈ ఇద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు.

సుమంత్ 2004 సంవత్సరంలో కీర్తి రెడ్డి ని వివాహం చేసుకొని, 2006 లో విడాకులు తీసుకున్నాడు. అప్పటి నుంచి ఆయన సింగిల్ గానే ఉంటున్నాడు. కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో సుమంత్ మాట్లాడుతూ కీర్తిరెడ్డి గురించి ఆసక్తికర విషయాలు చెప్పాడు.. గత వివాహం వల్ల నాకు ఎలాంటి రిగ్రెట్ లేదు.  ఏమో భవిష్యత్తులో పెళ్లి చేసుకుంటానేమో తెలియదు అన్నారు సుమంత్. కీర్తి రెడ్డి తో విడిపోయిన తర్వాత కూడా ఆమె  ఫ్యామిలీ ఇప్పటికీ నన్ను వాళ్ళ కుటుంబ సభ్యుడిగానే చూస్తూ ఉంటుంది. ఆమె ఫ్యామిలీ నాతో ఎంతో ఆప్యాయంగా ఉంటారు. కీర్తి రెడ్డి కూడా అప్పుడప్పుడూ నాకు ఫోన్ చేస్తూ ఉంటుంది అని అన్నారు సుమంత్. అలాగే ఆయన మాట్లాడుతూ.. మా పెళ్లైనప్పుడు మా ఇద్దరికీ సరైన మెచ్యూరిటీ లేదు. అందుకే ఆతర్వాత విడిపోయాం. మేం విడిపోవడానికి అదొక్కటే కారణం. మా ఇద్దరి లైఫ్ ఒకరకంగా సినిమా స్టోరీలా సాగింది అని సుమంత్ చెప్పుకొచ్చారు. ఈ కామెట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దీపావళికి ఆఫర్‌.. రూ. 699కే 4జీ ఫోన్‌.! ఓటీటీ ప్లాన్స్ లో కూడా..
దీపావళికి ఆఫర్‌.. రూ. 699కే 4జీ ఫోన్‌.! ఓటీటీ ప్లాన్స్ లో కూడా..
వెయ్యి కోట్లకు ఒక్క రూపాయి తక్కువైనా తగ్గేదే లే.! మహేష్ రాజమౌళి
వెయ్యి కోట్లకు ఒక్క రూపాయి తక్కువైనా తగ్గేదే లే.! మహేష్ రాజమౌళి
ఇక నుంచి ఆహా గోల్డ్‌ బాధ్యత మనోడిదే.! ప్రోమో వీడియో వైరల్..
ఇక నుంచి ఆహా గోల్డ్‌ బాధ్యత మనోడిదే.! ప్రోమో వీడియో వైరల్..
తారే జమీన్ పర్‌ బుడ్డోడు.. ఇప్పుడు హీరోగా వచ్చాడు తెలుసా.!
తారే జమీన్ పర్‌ బుడ్డోడు.. ఇప్పుడు హీరోగా వచ్చాడు తెలుసా.!
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. OTTలోకి దేవర.! డేట్ ఫిక్స్..
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. OTTలోకి దేవర.! డేట్ ఫిక్స్..
జాక్‌ పాట్ కొట్టేసిన మోహబూబ్‌.! ఉన్న 3 వారాలకి హై రెమ్యునరేషన్..
జాక్‌ పాట్ కొట్టేసిన మోహబూబ్‌.! ఉన్న 3 వారాలకి హై రెమ్యునరేషన్..
వేణు స్వామికి బిగ్ షాక్.! అరెస్ట్ తప్పదా.? నాగచైతన్య- శోభితలపై..
వేణు స్వామికి బిగ్ షాక్.! అరెస్ట్ తప్పదా.? నాగచైతన్య- శోభితలపై..
భారీ ప్రమాదం, ముఖానికి 20 కుట్లు.. నటి ఎమోషనల్ వీడియో.!
భారీ ప్రమాదం, ముఖానికి 20 కుట్లు.. నటి ఎమోషనల్ వీడియో.!
'సర్కార్‌' లీకైన బాలయ్య సినిమా టైటిల్ | గురూజీ రూ.500 కోట్లు..
'సర్కార్‌' లీకైన బాలయ్య సినిమా టైటిల్ | గురూజీ రూ.500 కోట్లు..
చాపకింద నీరులా వచ్చి.. కాటికి దారి చూపిస్తోంది
చాపకింద నీరులా వచ్చి.. కాటికి దారి చూపిస్తోంది