Jyothiraj: సందీప్ మాస్టర్ భార్య గొప్ప మనసు.. రోడ్ల పక్కన నిద్రించే అభాగ్యుల కోసం ఏం చేసిందంటే? వీడియో
సందీప్ మాత్రమే కాదు ఆయన భార్య జ్యోతి రాజ్ కూడా మంచి డ్యాన్సరే. ఇప్పటికే పలు టీవీ షోల్లో సందడి చేస్తుందామె. సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ తన డ్యాన్స్ వీడియోలను షేర్ చేస్తుంటుంది. అలా తాజాగా జ్యోతి రాజ్ షేర్ చేసిన ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. ఆమె చేసిన మంచి పనికి అభిమానులు, నెటిజన్ల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది .
తనదైన గ్రేస్ ఫుల్ డ్యాన్స్, మూమెంట్స్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సందీప్ మాస్టర్ అలియాస్ ఆట సందీప్. ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఆట’ మొదటి సీజన్‌లో విన్నర్‌గా నిలిచాడు సందీప్. అప్పటి నుంచి తన పేరును ఆట సందీప్‌గా మారిపోయింది. సోషల్ మీడియాలో డ్యాన్స్ వీడియోలతో సందడి చేసే సందీప్ ఇటీవల బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు ఏడో సీజన్‌లో ఎంట్రీ ఇచ్చాడు. స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా తన ఆటతీరు, మాటతీరుతో బుల్లితెర అభిమానులను అలరించాడు. గ్రాండ్ ఫినాలేకు చేరుకోలేకపోయినా బిగ్ బాస్ షోతో బాగానే క్రేజ్ సంపాదించుకున్నాడీ డ్యాన్స్ మాస్టర్. సందీప్ మాత్రమే కాదు ఆయన భార్య జ్యోతి రాజ్ కూడా మంచి డ్యాన్సరే. ఇప్పటికే పలు టీవీ షోల్లో సందడి చేస్తుందామె. సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ తన డ్యాన్స్ వీడియోలను షేర్ చేస్తుంటుంది. అలా తాజాగా జ్యోతి రాజ్ షేర్ చేసిన ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. ఆమె చేసిన మంచి పనికి అభిమానులు, నెటిజన్ల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది . ఇంతకీ జ్యోతి రాజ్ ఏం చేసిందనేగా.. అయితే అసలు విషయంలోకి వెళదాం రండి.
తెలుగు రాష్ట్రాల్లో చలి గాలులు బలంగా వీస్తున్నాయి. గతంలో ఎప్పుడూ లేనంతగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దీంతో సామాన్య జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక హైదరాబాద్ లాంటి మెట్రో నగరాల్లో ఆరు బయటే నిద్రించేవారి పరిస్థితి మరీ ఘోరం. ఇలాంటి వారికోసమే ఓ మంచి పని చేసింది సందీప్ మాస్టర్ సతీమణి జ్యోతి రాజ్. ఎముకలు కొరికే చలిలో ఆరుబయటే నిద్రిస్తున్న వారికోసం తనవంతు సాయంగా ముందుకు కదిలిందామె. హైదరాబాద్‌లో పుట్‌పాత్‌లపై నిద్రిస్తున్న వారికి స్వయంగా దుప్పట్లు కొని అందించారు. తన స్నేహితురాలితో కలిసి రోడ్ల పక్కనే నిద్రిస్తున్న జనాలకు వాటిని అందించారు. ఇలాంటి సహాయ కార్యక్రమాలు మరిన్ని చేపడతామని జ్యోతి రాజ్ తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోలను ఆమె తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేయగా ప్రస్తుతం ఇవి వైరల్‌గా మారాయి. ‘చాలా మంచి పని చేశారు మేడమ్’ అంటూ అభిమానులు, నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మీరు మరింతమందికి సాయం చేయాలని కామెంట్లు పెడుతున్నారు.
స్నేహితురాలితో కలిసి…
View this post on Instagram
చలికాలంలో అభాగ్యుల బాధలు చూడలేక..